Pawan kalyan : నా కూతురు కోసం దాచిన డ‌బ్బులు పార్టీ కోసం వాడాను : ప‌వ‌న్ కల్యాణ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan kalyan : నా కూతురు కోసం దాచిన డ‌బ్బులు పార్టీ కోసం వాడాను : ప‌వ‌న్ కల్యాణ్

 Authored By mallesh | The Telugu News | Updated on :29 September 2021,9:50 pm

Pawan kalyan : సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ Pawan kalyan చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారమే రేపాయి. వైసీపీ నేతలు, మంత్రులు పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా బుధవారం జనసేనాని పవన్ కల్యాణ్ Pawan kalyan  అమరావతిలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 2024లో జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఆ విషయమై తేల్చుకునేందుకు సిద్ధమా అని వైసీపికి సవాల్ విసిరారు.

pawan kalyan Speech at Mangalagiri

pawan kalyan Speech at Mangalagiri

తాట తీసి ఒక్కొక్కరిని మోకాళ్లపై కూర్చొబెడతామని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రారంభం గురించి పవన్ వివరించారు. తన కూతురు భవిష్యత్తు కోసం డిపాజిట్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్రేక్ చేసి పార్టీ స్థాపించినట్లు, అమరావతిలో పార్టీకి స్థలం కోసం డబ్బు ఖర్చు చేసినట్లు జనసేనాని వివరించారు.ఏపీలో వైసీపీకి కాలం చెల్లిందని, తన సినిమాలు ఆపుకున్నా తనకు ఏం నష్టలేదని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  Pawan kalyan ఏపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు. జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆడపడుచులను వైసీపీ ప్రభుత్వం, నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

pawan kalyan Speech at Mangalagiri

pawan kalyan Speech at Mangalagiri

Pawan kalyan : వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది: జనసేనాని

ప్రజాస్వామ్య బద్ధంగానే వైసీపీని బలంగా ఎదుర్కొంటామని పవన్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, యుద్ధానికి తమను వైసీపీ వారే పిలిచారని పవన్ చెప్పారు. తనను తిడుతున్న ప్రతీ ఒక్కరిని గుర్తు పెట్టుకుంటానని పవన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మధుసూదన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

pawan kalyan Speech at Mangalagiri

pawan kalyan Speech at Mangalagiri

తాను రెడ్ల పాలేరునని గర్వంగా, ధైర్యంగా చెప్తానని, పవన్ కల్యాణ్ ఎవరి పాలేరో ధైర్యంగా చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. జనసేన పార్టీ కిరాయి పార్టీ అని, కిరాయికి ఇచ్చేందుకే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారని ఆరోపించారు. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారని మంత్రి నాని తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్ విధానం అనేది దేశవ్యాప్తంగా ఉందని, కేవలం ఏపీలోనే లేదని మంత్రి నాని వివరించారు.

 

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది