Pawan Kalyan : కోటి రూపాయలు ఇస్తా కానీ పుస్తకం మాత్రం ఇవ్వలేను.. పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో ఒక పాపులర్ ఫిగర్ అయ్యాడు. ఆయన ఏం మాట్లాడినా అదో క్రేజ్ అనేలా ఉంది. ఏపీ పాలిటిక్స్ లో తన మార్క్ చూపిస్తున్న Pawan Kalyan పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పరిపాలన సాగిస్తున్నారు. ఐతే సమయం వచ్చినప్పుడు తన ప్రత్యేకత చూపిస్తున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్. నేడు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గ్రౌండ్ లో జరిగిన 35వ పుస్తక మహోత్స్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన తాను కోటి రూపాయలు ఇవ్వడానికి వెనకాడను కానీ పుస్తక ఇవ్వడానికి ఆలోచిస్తా అన్నారు. పుస్తకం ఇవ్వాలంటే సంపద ఇచ్చినట్టే అని పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణుడికి కవచ కుండలాలు కోసేస్తే ఎంత బాధపడతాదో తెలియదు కానీ తన నుంచి పుస్తకం దూరమైతే కిందా మీద పడతా అన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan తాను కోరుతున్న చదువు పుస్తకాల్లో లేదు..
ఇదే మీటింగ్ లో ఇంటర్ చదవలేక నేను చదువు ఆపలేదని.. తాను కోరుతున్న చదువు పుస్తకాల్లో లేదు అందుకే ఆపేశా అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని చదువుకున్నడు. ఆయన ప్రేరణతో పుస్తకాలు, మొక్కలు చెట్లు చూస్తూ ఉండిపోయా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. Pawan Kalyan, Pawan Kalyan speech, Vijayawada, Book Exhibition, AP Deputy CM