Pawan Kalyan : వీరమల్లు కోసం పవర్ స్టార్ పాడుతున్నాడా.. పెంచల్ దాస్ సాహిత్యం తో ఫ్యూజులు అవుట్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : వీరమల్లు కోసం పవర్ స్టార్ పాడుతున్నాడా.. పెంచల్ దాస్ సాహిత్యం తో ఫ్యూజులు అవుట్..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమాల్లో సరదాగా పాట పాడతారు. తన సినిమాల్లో ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా సాంగ్ ఆలపిస్తాడు పవర్ స్టార్. సినిమాలో పాడటం అంటే అదో సరదా అనుకుంటాడు. ఐతే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ పాడిన పాటలు సూపర్ అనిపించేస్తాయి. ఐతే పవన్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ పాటేసుకుంటున్నాడని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో ఆయన పాడుతున్నట్టు తెలుస్తుంది. వీరమల్లు సినిమా కోసం పవన్ మరోసారి గొంతు సవరించుకుంటున్నారు. వీరమల్లు కి అకడమీ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఐతే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పాట సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.
Pawan Kalyan పవర్ స్టార్ సాంగ్ తో రచ్చ కన్ఫర్మ్..
పవన్ సాంగ్ ని పెంచల్ దాస్ సాహిత్యం అందిస్తున్నారని తెలుస్తుంది. అరవింద సమేత సినిమాలో పెంచల్ దాస్ సాహిత్యం అదిరిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన వీరమల్లు కోసం సాంగ్ రాస్తున్నారు. పెంచల్ దాస్ సాహిత్యం కీరవాణి మ్యూజిక్ లో పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నాడు. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ ని జనవరి 6న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ సో న్యూ ఇయర్ కు పవర్ స్టార్ సాంగ్ తో రచ్చ కన్ఫర్మ్ అవ్వబోతుంది.ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.
నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హరి హర వీరమల్లు సినిమా మార్చి 28న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా చేస్తున్నాడు. వీరమల్లు కోసం మరో 8 రోజులు షూట్ చేస్తే అయిపోతుందని పవన్ చెప్పారు. సుజిత్ ఓజీ కోసం తాను డేట్స్ ఇచ్చినా వాళ్లే సరిగా వాడుకోలేదని పవన్ చెప్పడం విశేషం.