YS Jagan – Pawan Kalyan : తొలిసారి జగన్‌కి జై కొట్టిన పవన్ కళ్యాణ్.. జగనే సీఎం అని ఒప్పేసుకున్నాడు?
YS Jagan – Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు చాలా హీటెక్కాయి. అసలు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తాం అని చెప్పుకుంటున్నాయి. అయితే.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఏపీలో కొన్ని సర్వేలు హడావుడి చేస్తున్నాయి. ఆ సర్వేలు ఏం చెప్పాయో తెలుసా? ఏ సర్వే చూసినా 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే అని చెప్పుకొచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పుకొచ్చారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డీలా పడినట్టుగా అయిపోయాయి.
ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ సర్వేల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించదు అని చెబుతున్నారు. అసలు జనసేన పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించే అవకాశం లేదని అంటున్నాయి. ఒక్క వైసీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు అన్నీ కలిసిపోయాయి. ప్రజలను పూర్తిగా తప్పు పట్టించడం కోసం వాళ్లను మించిన ఘనలు లేరు. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కోసారి చేదు నిజాలు మాట్లాడుతారు. ఆయన ఆవేశంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. ఆ ఆవేశంలోనే నిజాలు మాట్లాడుతారు.
YS Jagan – Pawan Kalyan : మళ్లీ ముఖ్యమంత్రి జగనే.. అంటూ తేల్చిన జాతీయ సర్వేలు
ఇప్పటి వరకు విడుదల అయిన జాతీయ సర్వేలు చూసుకుంటే ఏపీలో మళ్లీ గెలిచేది సీఎం జగనే అంటూ చెబుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు మాత్రం ఏం చేస్తాయి. అందుకే పవన్ కళ్యాణ్ కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే అవుతారు అని ఈ మధ్య ఒక మాట అంటున్నారు. మీరు కనుక ఈ సారి మాకు అవకాశం ఇవ్వకపోతే ఇక ఎవ్వరూ ఏం చేయలేరు అంటున్నారు. వాస్తవానికి సర్వేలు చూసినా ఏం చేసినా జగనే అధికారంలోకి వస్తారు. అది మామూలుగా కాదు.. అది ఒక ప్రభంజనం. ఖచ్చతంగా ముఖ్యమంత్రిగా జగనే అవుతారు చూడండి అంటూ పవన్ కళ్యాణ్ ఉటంకిస్తున్నారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టడం ఇక జనసేన పార్టీ వల్ల కాదని పవన్ ఫిక్స్ అయ్యారా? చంద్రబాబుతో కలిసినా గెలిచే చాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో ఏ చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి. చూద్దాం మరి ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయో?