
perni nani about prashanth kishore meeting with chandrababu
Perni Nani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఏపీలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. మళ్లీ ఏపీలో ఎవరి రాజ్యం రాబోతోందని అంతా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను ఎలా ఆకర్షించాలో పథకాలు రచిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై భేటీ అయ్యారు. ఆయన్ను ప్రశాంత్ కలవడంపై తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. అసలు చంద్రబాబుకు సిగ్గు, శరం ఏమైనా ఉందా? ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు.. లోకేష్ ఏం మాట్లాడాడు. బీహారోడు వాడు.. ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు అని అన్నారు. బీహారోడి ఆట కట్టిస్తాం.. తోలు తీస్తాం.. అన్నారు. ఇవన్నీ ఏపీ ప్రజలు విన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ బీహారోడితో ఎందుకు చేతులు కలిపారు అంటూ మండిపడ్డారు.
నిజంగానే చంద్రబాబుకు అంత నమ్మకం ఉంటే.. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు కదా. పవన్ మీద కూడా నమ్మకం లేదా? అందుకే పీకేను తెచ్చి పెట్టుకున్నారా? టీడీపీ శ్రేణులపై కూడా నమ్మకం లేదా? అందుకే పీకే టీమ్ తో వ్యూహాలు రచిస్తున్నారా? మీరు ఎన్ని వ్యూహాలు రచించినా.. ఏం చేసినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనాల గుండెల్లో ఉన్నారు. ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు ఖాయం. వైసీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు అని పేర్ని నాని స్పష్టం చేశారు.
మీరు ప్రజలను నమ్ముకోలేదు.. పీకేను నమ్మకున్నారు. మాకు ఎవ్వరి సలహాలు అక్కర్లేదు.. మాకు ప్రజలు ఉన్నారు. మేము ప్రజలను నమ్ముకున్నాం అని లోకేష్ గప్పాలు కొట్టాడు. కానీ.. చివరకు పవన్ మీద నమ్మకం లేక.. టీడీపీ నేతల మీద నమ్మకం లేక.. మేము ఛీ కొడితే బయటికి వెళ్లిన వాడిని గతిలేక బతిమాలి మరీ తెచ్చుకున్నారు.. అంటూ పేర్ని నాని అన్నారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.