Perni Nani : జైలుకైనా పోతా కానీ.. వైసీపీని వదిలేది లేదు :పేర్ని నాని
ప్రధానాంశాలు:
Perni Nani : జైలుకైనా పోతా కానీ.. వైసీపీని వదిలేది లేదు :పేర్ని నాని
Perni Nani : వైసీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. రేషన్ బియ్యం మిస్సింగ్ విషయంలో తమ కుటుంబ సభ్యులను జైలుకు పంపించడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఆయన ఆరోపించారు. పేర్ని జయసుధకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. తనను, తన కుటుంబాన్ని రాజకీయ వేధింపులకు గురి చేస్తూనే, కూటమి తప్పులను ఎండగడతానని హెచ్చరించారు.

Perni Nani : జైలుకైనా పోతా కానీ.. వైసీపీని వదిలేది లేదు :పేర్ని నాని
“తమ కుటుంబం ఎటువంటి తప్పు చేయలేదని, కృష్ణా జిల్లా పోలీసులకు కూడా తెలుసన్నారు. అయినప్పటికీ తన భార్యపై దారుణమైన సెక్షన్లు సమోదించి, ఆమెను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారని అన్నారు. అయితే ఆ సెక్షన్లు తన భార్యకు వర్తించవని జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఆయన వివరించారు. ఇప్పుడు పోలీసులైన వారు, హైకోర్టుకు వెళ్లి బెయిల్ ను రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారని నాని పేర్కొన్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ పై కూడా విమర్శలు చేశారు.
ఇంత వరకూ తమ కుటుంబంపై మినహాయిస్తే పౌరసరఫరాలశాఖ ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని, స్వయంగా పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 22 వేల టన్నుల బియ్యం పెట్టుకున్నా కేసు లేదన్నారు. వాళ్లపై కేవలం 6ఎ కేసు నమోదు చేశారన్నారు.