Perni Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Perni Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2025,10:39 pm

ప్రధానాంశాలు:

  •  Perni Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..!

Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు ఆపడం లేదు. తాజాగా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మైనారిటీ వర్గాలకు అనుకూలంగా మాట్లాడితే, ఎన్నికల తర్వాత కషాయం బట్టలు వేసుకొని తనను సనాతన హిందువుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. ఇది ఓ రాజకీయ నాటకమేనని, మతాన్ని ఉపయోగించి ఓట్లు కొల్లగొట్టే కుట్రేనని వారు మండిపడ్డారు.

Perni Nani పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు

Perni Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..!

Perni Nani : పవన్ కళ్యాణ్ కషాయం బట్టలు వేసుకొని.. అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు

పేర్ని నాని వక్స్ చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన వక్స్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఈ చట్టాన్ని మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. ముస్లింల మతహక్కులను హరించేలా ఈ చట్టం ఉందని, మసీదుల పాలనలో ముస్లిమేతరులను నియమించడం అన్యాయమన్నారు. అదే సమయంలో దేవాదాయ శాఖలో హిందుయేతరులను తొలగిస్తున్నామని చెబుతూ, వక్స్ బోర్డులో ముస్లిమేతరుల నియామకాన్ని సమర్థించడం దుర్మార్గమని విమర్శించారు.

చంద్రబాబు, లోకేష్ లపై కూడా మండిపడ్డ పేర్ని నాని.. వారు నిజంగా ప్రజల కోసం పని చేస్తే అసెంబ్లీలో వక్స్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయగలరా అని సవాల్ విసిరారు. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాడుచేస్తూ కేంద్రంలో రెండవ స్థానాన్ని పొందడం హాస్యాస్పదమన్నారు. చివరగా, మాజీ సీఎం చంద్రబాబు దళితులపై అన్యాయం చేశారని, వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని, రాజధానిలో వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవడం వెనుక కూడా చంద్రబాబు స్వార్థమే ఉందని ఆరోపించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది