YCP : పిన్నెల్లి తప్పు చేశాడు సరే.. మరి వైసీపీ చేసింది తప్పు కాదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : పిన్నెల్లి తప్పు చేశాడు సరే.. మరి వైసీపీ చేసింది తప్పు కాదా..?

 Authored By aruna | The Telugu News | Updated on :23 May 2024,9:00 pm

YCP : ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలనేది అన్ని పార్టీలకు ఉన్న ఒక నినాదం. అయితే ఇప్పుడు ఏపీలో పిన్నెల్లి రామకృష్నారెడ్డి చేసింది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు అలాంటి ఘటనను ఏ ఎమ్మెల్యే కూడా చేయడు. పైగా ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేస్తున్న ఒక ప్రతినిధి అస్సలు చేయొద్దు. దాదాపు 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి ఇలాంటి పని చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా ఈవీఎంలను ధ్వంసం చేయడం ఏంటని ఇప్పుడు దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలు ఎలా ఉన్నాయంటే.. రిగ్గింగ్ జరుగుతుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే ఆయన అన్నట్టు రిగ్గింగ్ జరిగితే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా న్యాయ పోరాటం చేయాలి కదా..అప్పుడు ప్రజలంతా ఆయనవైపే ఉండేవారు. కానీ ఆయన అలా చేయలేదు. పోనీ రిగ్గింగ్ జరిగినట్టు ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ప్రజల నిర్ణయం ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆయనకు గెలుస్తాననే నమ్మకం ఉంటే ఇలా ఎందుకు చేస్తారు.. ఓడిపోతాననే భయం ఉంటేనే ఇలా చేస్తారు కదా అంటున్నారు.

అయితే పిన్నెల్లి చేసింది తప్పు అని ఈసీ భావిస్తోంది సరే. మరి వైసీపీ చేసిందేంటి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేది ప్రతి రాజకీయ పార్టీ సిద్దాంతం. మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పని చేసిన పిన్నెల్లిపై వైసీపీ స్పందన ఏంటి. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. ఇన్ని రోజులు తనది ప్రజాస్వామ్య బద్దంగా ఉండే పార్టీ అని చెప్పుకున్న ఆయన.. మౌనంగా ఉండటం అంటే ఈ ఘటనను సమర్థించినట్టు కాదా అని అడుగుతున్నారు ప్రజాస్వామ్య వాదులు. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కదా అని అడుగుతున్నారు. వైసీపీ ఇలా మౌనంగా ఉండటం కూడా తప్పే అని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది