Chandrababu : పొత్తులకు సంబంధించి చిక్కుల వలయంలో పడిపోయిన చంద్రబాబు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : పొత్తులకు సంబంధించి చిక్కుల వలయంలో పడిపోయిన చంద్రబాబు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :15 July 2023,3:00 pm

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్షణం క్షణానికి మారిపోతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరిట గోదావరి జిల్లాలలో సీఎం జగన్ మరియు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరో పక్క లోకేష్ తన పాదయాత్రతో ప్రభుత్వంపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి చావో రేవో అన్న పరిస్థితి మాదిరిగా ఏర్పడిందట.

ఈ క్రమంలో ఒంటరిగా తెలుగుదేశం పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్లు చీలిపోయి మళ్లీ వైసీపీ యే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు భావన. దీంతో ఎట్టి పరిస్థితుల్లో యధావిధిగా 2014 మాదిరిగా పొత్తులతో… డీ కొట్టాలని చంద్రబాబు ప్లానింగ్ అట. ఇటువంటి పరిస్థితులలో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి మొన్నటిదాకా తీవ్రస్థాయిలో శ్రమించడం జరిగింది. కానీ తాజాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలలో బీజేపీకి.. వ్యతిరేకమైన ఫలితాలు రావడంతో చంద్రబాబు డైలమాలో పడ్డారట. మరి ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో… ఇప్పుడు ఏపీ పొత్తులకు సంబంధించి చంద్రబాబు చిక్కుల వలయంలో చిక్కుకున్నారట.

విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం బీజేపీ పై వ్యతిరేకత ఉంది. విభజనకు గురైన రాష్ట్రానికి ఆర్థికంగా నిధులు ఇవ్వడంలో మరియు స్పెషల్ స్టేటస్ వంటి హామీలు కూడా నెరవేర్చక పోవడంతో జనాలలో కమలం పార్టీ పట్ల వ్యతిరేకత నెలకొంది. ఇటువంటి పరిస్థితులలో కమలం పార్టీతో దోస్తీ పెట్టుకోవడం వల్ల తమకే నష్టం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర మంత్రి నారాయణస్వామి.. కచ్చితంగా పొత్తులు ఉంటాయని.. కామెంట్లు చేసిన తాము అప్పుడే ముందుకు వెళ్ళమని చంద్రబాబు మీడియా ముందు చెప్పటం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పొత్తులు.. పెట్టుకోవాలా వద్దా అనేది ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో టీడీపీ ఉన్నట్లు టాక్.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది