Tirumala Laddu : దేవుడి లడ్డూతో రాజకీయాలా.. నేతల్లో ఆందోళన మొదలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirumala Laddu : దేవుడి లడ్డూతో రాజకీయాలా.. నేతల్లో ఆందోళన మొదలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 September 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Tirumala Laddu : దేవుడి లడ్డూతో రాజకీయాలా.. నేతల్లో ఆందోళన మొదలు..!

Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం పెను దుమారంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ అంశంగా మారింది. లడ్డులో కలీ నెయ్యి వాడారన్న వార్త ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ ధార్మిక సంఘాలు ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఇంత తప్పిదం ఎలా జరిగిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఐతే అసలు ఇష్యూ వదిలి దీన్ని రాజకీయం చేస్తూ ప్రజలని మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది. వారి రాజకీయాల్లోకి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని లాగారు. తిరుమల దశనంలో రాజకీయ నాయకులు కూడా ఎక్కువ పాల్గొంటారు. తాజా పరిణాలు చూసి నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. స్వామి వారితో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.

లడ్డూ వివాదంపై కొందరు నేతలు మాట్లాడటానికి ముందుకు రావట్లేదు. అధికార పక్షంలో మంత్రులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. ప్రతి పక్షం సైతం అలానే ఉన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అధికారం పక్షం ఆరోపిస్తుంటే వైసీపీ దీన్ని ఖండిస్తుంది. ఐతే వైసీపీ అన్యమత ప్రచారం లో భాగంగా వారిపై ఈ ముద్ర పడింది. అందుకే ఆ పార్టీలో ఉన్న శ్రీవారి భక్తులు నేతలు భయ పడుతున్నారు.

Tirumala Laddu దేవుడి లడ్డూతో రాజకీయాలా నేతల్లో ఆందోళన మొదలు

Tirumala Laddu : దేవుడి లడ్డూతో రాజకీయాలా.. నేతల్లో ఆందోళన మొదలు..!

ల్యాబ్ లో టెస్ట్ చేసి నిర్ధారణ చేశారని చెబుతున్నారు. విపక్షం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జగన్ కనీసం దానిపై విచారం వ్యక్తం చేయడం లేదు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని అంటున్నారు. దీనిపై నేతలు మాట్లాడేందుకు అంగీకరించడం లేదు. ఈ విషయంపై ముగింపు ఎప్పుడు ఉంటుందో కానీ తిరుమల లడ్డూ వివాదంపై ప్రతిది వైసీపీ టార్గెట్ గానే అధికార పక్షం వ్యాఖ్యలు ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది