Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత
ప్రధానాంశాలు:
ప్రకాష్ రెడ్డికి పరిటాల రవి అంటే భయమా..లేక మక్కువా - పరిటాల సునీత
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాష్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా, 20 ఏళ్ల కిందట చనిపోయిన పరిటాల రవి పేరు తీయకుండా ఒక్క మీటింగ్‌లోనైనా మాట్లాడారా అని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రకాష్ రెడ్డికి పరిటాల రవి పట్ల ఉన్న మక్కువో, లేక భయమో అర్థం కావడం లేదన్నారు.

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత
Paritala Sunitha : పరిటాల రవి చనిపోయి 20 ఏళ్లు అవుతున్న ఇంకా ప్రకాష్ రెడ్డి వణికిపోతున్నాడు – పరిటాల సునీత
చిన్న కేసు నమోదైతేనే ప్రకాష్ రెడ్డి పరారయ్యారని, మరి పెద్ద కేసులైతే ఏమవుతాడని పరిటాల సునీత ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అలజడికి దారితీస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
పరిటాల సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. గత కొన్నేళ్లుగా పరిటాల కుటుంబానికి, తోపుదుర్తి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. ఈ తాజా విమర్శలు ఈ వైరాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇదిలా ఉంటె జగన్ నెల్లూరు పర్యటన పై కూడా సునీత తీవ్ర విమర్శలు చేసింది. చంద్రబాబు బావిలో దూకడం కాదు.. నువ్వు నీళ్లు లేని బావిలో పడ్డా.. నువ్వు చేసిన పాపాలు పోవంటూ విమర్శించారు. నువ్వు చేసిన అక్రమాలకు తొందరలోనే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.. సూట్‌కేసు రెడీ చేసుకో అంటూ సూచించారు.