Prashanth Kishore : ఆ ప్రాంతంలో వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం .. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ .. షాక్ లో చంద్రబాబు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prashanth Kishore : ఆ ప్రాంతంలో వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం .. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ .. షాక్ లో చంద్రబాబు..!!

Prashanth Kishore : ఏపీలో శాసనసభ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఇక టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు టీడీపీని కలిసిన ప్రశాంత్ కిషోర్ ని చూసి వైసీపీకి మింగుడు పడటం లేదు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రం మొదటి నుంచి ఆయన ఒంటరిగా పోరాటం చేయడం, ఎంతమంది కలిసి వచ్చిన […]

 Authored By anusha | The Telugu News | Updated on :26 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Prashanth Kish ఆ ప్రాంతంలో వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం .. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ .. షాక్ లో చంద్రబాబుore :

Prashanth Kishore : ఏపీలో శాసనసభ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఇక టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు టీడీపీని కలిసిన ప్రశాంత్ కిషోర్ ని చూసి వైసీపీకి మింగుడు పడటం లేదు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రం మొదటి నుంచి ఆయన ఒంటరిగా పోరాటం చేయడం, ఎంతమంది కలిసి వచ్చిన ప్రజల కోసం ఒక్కడినే పోరాడుతా అని చెప్పడం, దీని వలన టిడిపి జనసేన డామినేట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది జగన్ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలి. ఏం చేస్తే జగన్ ఓడిపోతాడు అనేదానిపైన చర్చించడం జరిగింది.

వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు ఇన్ఫార్మ్ ఇవ్వడం, ఏ ప్రాంతాలలో జగన్ కు చంద్రబాబుకు సర్వే లో ఎంత పాజిటివ్ గా ఉన్నది ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కోనసీమలో జగన్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చంద్రబాబుకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. అయితే అక్కడ జనసేనకి ఎక్కువ టికెట్లు ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపి కనుక పోటీ చేస్తే జగన్ కు ఫేవర్గా ఉంది. ఒక సామాజిక వర్గం ఓట్లు జగన్ కు పడతాయి. ఆ ప్రాంతంలో జనసేనకు సీట్లు ఎక్కువగా ఇవ్వాలి అని కరాకండిగా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. దానిని చంద్రబాబు కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

టీడీపీ, జనసేన కలవడం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంతంలో ఓట్లు, సీట్లు కరెక్ట్ గా తెచ్చుకుంటే నే ఈ ప్రాంతం పాజిటివ్గా ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో అక్కడక్కడ దెబ్బతిన్నా కోనసీమ కవర్ చేస్తుంది అని అంటున్నారు. రెండు ఉభయగోదావరి జిల్లాలో జగన్ వైపు నిలబడితే కచ్చితంగా టీడీపీకి ఓటమి ఖాయం అని అంటున్నారు. కాబట్టి టీడీపీ, జనసేన చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది. అందుకే టీడీపీ, జనసేనకి ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఇవ్వాలి. రిస్క్ తీసుకొని టిడిపికి సీట్లు ఇస్తే అక్కడ ఓటమి ఖాయం అని, ఆ ప్రాంతంలో జగన్ కు పాజిటివ్ గా ఉందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాబట్టి టిడిపి కోనసీమ ప్రాంతంలో జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంద ని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తెలుస్తుంది ఇక అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా జనసేనకు ఓట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది