TDP : స్క్రీన్‌ప్లే ఒక‌రిది.. యాక్ష‌న్ టీడీపీదా!

అమ‌రావతి : పొలిటిక‌ల్‌ స్ట్రాట‌జిస్ట్. అంటే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో వీరు పోషిస్తున్న‌ పాత్ర మ‌న క‌ళ్ల‌ముందున్న‌దే. ప‌వ‌ర్‌ను నిలుపుకునేందుకు అధికార‌ప‌క్షం, ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ప్ర‌తిప‌క్షం ఇరుప‌క్షాలు వీరిపై ఎంత‌గా ఆధార‌ప‌డుతున్నాయో మ‌నం చూస్తున్న‌దే. ప్ర‌శాంత్ కిశోర్‌.. దేశంలోనే ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పేరుగాంచిన వ్య‌క్తి. వైఎస్ఆర్‌సీపీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించి జ‌గ‌న్ ఏ విధంగా అధికారంలోకి వ‌చ్చేందుకు తోడ్ప‌డింది తెలిసిందే. చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఈయ‌న శిష్యుడు రాబిన్ శ‌ర్మ‌ను టీడీపీ త‌మ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకుంది. గ‌త కొంత‌కాలంగా రాబిన్ నేతృత్వంలోనే టీడీపీ యాక్ష‌న్ కొన‌సాగుతుంది. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాస్త యాక్టివ్ అయిన ఆ పార్టీ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం ఊపందుకున్నాయి.

tdp

స్తంభంగా ఉంటే జ‌నాలు త‌మ‌ని మ‌ర్చిపోతార‌నో, ఆ మాత్రం ప్ర‌తిప‌క్ష హోదా కూడా మిగ‌ల‌ద‌నో లేదా మ‌ళ్లా ఎన్నిక‌ల స‌మ‌యానికి క‌నుమ‌రుగే అవుతామ‌నో భ‌యంతోనో ఏదైతేనేం మొత్తంమీద క్రీయాశీల‌కంగా మారుతున్నారు. రాబిన్ డైరెక్ష‌న్ ప్లాన్‌కు చంద్ర‌బాబు నాయుడు యాక్ష‌న్ దూకుడును జోడించారు. అందుకే ఏ మాత్రం సందు దొరికినా దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఇందుకు పాలనా వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌డుతూనో, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను నెత్తికొత్తుకునో కాకుండా విమ‌ర్శ‌ల‌ను ఆలంభ‌న‌గా చేసుకున్నారు. పాజిటివ్ కంటే నెగెటివ్ జ‌నాల్లోకి తొంద‌ర‌గా వెళ్తుంద‌ని ఇందుకు కార‌ణమై ఉండొచ్చు. నేటి స‌మాచార యుగంలో పాపుల‌ర్, అన్‌పాపుల‌ర్ కావాల‌న్న క్ష‌ణాల్లో జ‌రిగిపోతుంది. ఒక‌వైపు ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలు, మ‌రోవైపు ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియాతో ఓ అంశాన్ని జ‌నాల్లోకి క్ష‌ణాల్లో జొప్పించి చ‌ర్చ‌కు పెడుతున్నారు. ప్ల‌స్ అయితేనేం, మైన‌స్ అయితేనేం మొత్తం మీద మేము క్రీయాశీలంగా ఉన్నామంటూ త‌మ ఉనికి చాటుకుంటున్నారు. ప‌ట్టాభి అంశమే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా మ‌నం చూడొచ్చు.

chandrababu naidu

రాబిన్ డైరెక్ష‌న్‌లోనే ప‌ట్టాభి సీఎంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన‌ట్లుగా స‌మాచారం. అనుకున్న విధంగానే వైసీపీ శ్రేణులు స్పందించి ప్ర‌తివిమ‌ర్శ‌లు, దాడులు చేశారు. తాము ఆశించిన ఫ‌లితం వ‌చ్చిందన్న‌ట్టుగా చంద్ర‌బాబు వెంట‌నే రంగంలోకి దిగారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై వెంటనే గవర్నర్‌తో పాటు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయడం, 36 గంటల దీక్ష, ఢిల్లీ టూర్ ఇలా వ‌రుస‌గా దూసుకుపోతున్నారు. ఇదంతా రాబిన్ శర్మ డైరెక్ష‌న్‌లో కొన‌సాగుతున్న యాక్ష‌న్‌గా స‌మాచారం.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

16 minutes ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

1 hour ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

2 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

4 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

5 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

6 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

7 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 hours ago