Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఖరారు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థానానికి రఘురామకృష్ణంరాజు నామినేషన్‌ను ధృవీకరించారు. పలువురు అభ్యర్థులను సమీక్షించిన తర్వాత, చంద్రబాబు నాయుడు చివరికి రఘురామ కృష్ణం రాజు (RRR) వైపు మొగ్గు చూపారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోతే, సంకీర్ణ ఎమ్మెల్యేలు ఆయనను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆయన నియామకం ఇక లాంఛనప్రాయమే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. విధేయతకూ, బానిసత్వానికీ మధ్య ఉన్న తేడా తనకు తెలుసని.
అది తెలియకుండా నడుచుకోవాలని జగన్ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. నాడు స్వపక్షంలో విపక్షం పాత్రను పోషించారు. “రచ్చబండ” అంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విరుచుకుపడేవారు. 2024 సార్వత్రిక ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటి చేసి వైసీపీ అభ్యర్థిపై 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ట్రిపుల్ ఆర్ పేరును ఉప సభాపతిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.