Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక వారం ఇంటి మొత్తానికి అన్లిమిటెడ్ ఫుడ్ అందించడానికి నబీల్ ఈ సీజన్ అంతా స్వీట్స్ తినను అంటూ మాటిచ్చాడు. దాని ప్రకారమే తనకు చాలా ఇష్టమైనా సరే స్వీట్స్ తినకుండా నబీల్‌గా ఉండగా, కంటిన్యూగా స్వీట్ పంపించాడు బిగ్ బాస్. అయితే కన్ఫెన్షన్ రూంలో నబీల్ స్వీట్స్ తింటుండగా.. మెయిన్ డోర్ నుంచి వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చారు. తనను చూడగానే కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తి వెళ్లి ఆమె కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు.
కష్టపడి ఆడాలి.. గెలవాలి అంటే నీ ఆట నువ్వు ఆడాలి.. ఎవరి గురించి పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కావొద్దు. అందరితో మంచిగానే ఉండు అంటూ ఇండైరెక్ట్ గానే హింట్స్ ఇస్తూ సలహాలు ఇచ్చింది నబీల్ తల్లి. ఇక తల్లి వెళ్లిపోగానే నబీల్ ఎమోషనల్ అయ్యాడు. డోర్ దగ్గరి నుంచి నబీల్ వస్తుంటే పట్టుకుని బుగ్గమీద కిస్ ఇచ్చాడు నిఖిల్. ఇక మరోవైపు తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరి పేరెంట్స్ వస్తారు.. కానీ నా కోసం మాత్రం రారు. ప్లీజ్ బిగ్‌బాస్.. నేను ఏడిస్తే అమ్మకు నచ్చదు.. కానీ మా అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు. ఇంకా కష్టపడి ఆడతా బిగ్‌బాస్ ప్లీజ్. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు అంటూ బోరున ఏడుస్తూ కూర్చున్నాడు తేజ.
ఇక ఇదిలా ఉంటే యష్మి, ప్రేరణ, విష్ణు ప్రియాలు స్ట్రాంగ్ కంటెస్టెంట్ల జాబితాలో కనిపించారు. కానీ గత వారం చూస్తే యష్మి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. యష్మితో పోల్చితే ప్రేరణ చాలా బెటర్ పొజీషియన్‌లో ఉంది. ఇక విష్ణు ప్రియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె అటు స్ట్రాంగా? ఇటు వీకా అనేది తేల్చుకోలేకపోతుంది. అవినాష్, రోహిణి, టేస్టీ తేజలు ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్నారు. అయితే వీళ్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్ట్ లో ఉంటారా అనేది డౌట్. టాప్ 5లో అవినాష్‌కి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.ఎలిమినేట్ అవుతాడనుకున్న గౌతమ్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మణికంఠ కారణంగా బతికిపోయిన గౌతమ్ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టాప్ కంటెస్టెంట్‌లో ఒకరిగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు విన్నర్ ని తేల్చాల్సి వస్తే గౌతమ్ టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో…
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
This website uses cookies.