Ram Gopal Varma : లోకేష్ బేబీ.. నువ్వు వెళ్లి పాలు తాగుపో అమ్మా.. నీ తండ్రిని దేవుడు కూడా కాపాడలేడు.. నారా లోకేష్‌పై ఆర్జీవీ సెటైర్స్ అదుర్స్
ప్రధానాంశాలు:
నేను ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా
నేను ఏనాడైనా అభివృద్ధి చేస్తా అని చెప్పానా?
బేబీ.. అంటూ లోకేష్ పై వర్మ విసుర్లు
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ సమాజానికి ఏం చేశాడు? ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడు? చంద్రబాబు గారు ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు.. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.. అంటూ నారా లోకేష్.. రామ్ గోపాల్ వర్మపై సీరియస్ అయిన విషయం తెలుసు కదా. రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడని మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి.. చంద్రబాబు గారు ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సైబరాబాద్ ఏర్పాటు చేశారు. ఏపీ విభజన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు. ఆయన ఏం చేశాడు. ఆయన ఏం చేశాడని మాట్లాడాలి. ఏం సమాధానం చెబుతాడు.. అంటూ నారా లోకేష్ మీడియా ముందు ఆర్జీవీపై సీరియస్ అవడంతో పాటు ఆ వీడియోను ట్వీట్ చేశారు నారా లోకేష్. ఆ వీడియోపై రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో తీసి ట్వీట్ చేశారు.
లోకేష్.. నాకు నిన్ను చూసి జాలి పడాలా.. నవ్వాలా ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తాను. నేను ఫిలిం మేకర్ ను. సినిమాలు తీయడం నా పని. నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. పెరుగుతున్నాను.. చస్తాను అని ఎప్పుడైనా చెప్పానా బేబీ. నా పాయింట్ ఏంటి అంటే.. నువ్వు నన్ను క్రిటిసైజ్ చేయడానికి నీకు ఆంధ్ర రాష్ట్రం తప్పితే మరేం దొరకలేదా? అంటూ ఆర్జీవీ ప్రశ్నించాడు. నేను నీ ప్లేస్ లో ఏం చెప్పేవాడినో తెలుసా? వాడు పిచ్చిపిచ్చి సినిమాలు తీస్తాడు. అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడతాడు. అలాంటి వాడికి నేను అసలు వాడి గురించి రియాక్ట్ కావాల్సిన అవసరం ఏంటి అని చెప్పొచ్చు. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ.. నా లైఫ్ ఎప్పుడూ ఓపెన్ బుక్ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
Ram Gopal Varma : ఇంత చిన్న విషయం నీకు తెలియదా?
చంద్రబాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ డిస్టర్బ్ అయినట్టుంది. నాలాంటోడిని క్రిటిసైజ్ చేయడానికి నీకు ఎలాంటి మ్యాటర్ దొరక్కపోతే మీ తండ్రిని ఎవ్వరూ కాపాడలేరు. ఏం పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ గా వెళ్తుంది. నేను అడ్వైజ్ ఇస్తున్నా. ఇది జస్ట్ నా కన్సర్న్ మాత్రమే బేబీ. టేక్ కేర్ అంటూ ఆర్జీవీ రెచ్చిపోయి మరీ లోకేష్ పై సీరియస్ అయ్యాడు.
Hey @NaraLokesh https://t.co/Ms0EBzoyUJ pic.twitter.com/pAsEknubsD
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2023