Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి ఉచ్చుకత ఏదైతే ఉందో అది చాలా షాకింగ్ గా అనిపిస్తుంది అని చెప్పాలి. అయితే తెలంగాణలో ఎంపీ సీట్లు సాధించాలి అనుకోవడం లేదా కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి వాటిలో సాధించాలనుకుంటే ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం సాధించడానికి ఇంతలా ఎగబడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న.అయితే నిజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలను రంగంలోకి దించడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయం అని చెప్పాలి. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి గొప్ప నాయకుడి బిడ్డని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయగలడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం.ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా సాధిస్తే షర్మిలనే సాధించాలి . కానీ ఇప్పుడు అలా కాకుండా కొత్త ఎత్తుగడలతో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్ అవుతుందని తెలుస్తోంది. అయితే దీని వెనక ఎవరు ఉన్నారు…?వీరిని ఎవరు నడిపిస్తున్నారు…? ఇంత ఉత్సాహంగా ఎందుకు పరుగులు పెడుతున్నారు అనే అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.
రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించడానికి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఏ రకమైనటువంటి బాధ్యతలు చేపడతారు అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అధ్యక్షుడు కాదు మరి ఏమీ కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. అలాంటి వ్యక్తి ఏపీలో ఏం చేయగలుగుతారు అంటే ఒక స్ట్రాంగ్ ప్రచార సభలను తీసుకువచ్చి కనీసం 7 నుంచి 8 శాతం ఓట్ బ్యాంకింగ్ పెంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక దానిలో భాగంగానే వైయస్ షర్మిల ను వారు రంగంలోకి దించడం జరిగింది. వైయస్ షర్మిల కూడా ప్రస్తుతం బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక వైయస్ షర్మిల అడుగుతున్నటువంటి విధానం పద్ధతి చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని ఎందుకు విలీనం చేసింది అనే దానికి మాత్రం షర్మిల వద్ద సమాధానం లేదు.
కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించడంలో మాత్రం ఆమె చాలా యాక్టివ్ కనిపిస్తుంది. ప్రతి సభలో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి వైయస్ జగన్ చేయలేకపోయారని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలను షర్మిల ఆడడం జరిగింది.దీంతో షర్మిలపై మరియు కాంగ్రెస్ పార్టీపై పాజిటివ్ వేవ్ నడుస్తుందని చెప్పాలి . ఇక ఇలాంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో ప్రచారాలకు పూర్తి బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే గనక నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూతురుగా వచ్చినటువంటి షర్మిలకు ఇప్పుడు తోడుగా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదే గనక జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు కచ్చితంగా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.