CM Revanth Reddy : చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :4 January 2024,5:00 pm

CM Revanth Reddy : దేశంలోని అనేక రాష్ట్ర రాజకీయాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ ఎఫెక్ట్ తెలంగాణలో పడింది. అయితే తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్, దానికి వచ్చిన రిజల్ట్, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పై ఎఫెక్ట్ ఉంటుందని కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. కానీ ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రం లో ఉన్న పార్టీకి ఇంకో రాష్ట్రంలో ఉన్న పార్టీకి సపోర్టు ఉండడం ఎక్కువగా నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి రాజకీయ పార్టీ కి సంబంధించిన పారిశ్రామికవేత్తలు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్స్ అందరూ కూడా వాళ్ల బిజినెస్ మూలాలన్నీ కూడా హైదరాబాదులోనే ఉంటున్నాయి. ఇందువలన 2019 ఎన్నికల్లో కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మానిటరి వ్యవస్థను కంట్రోల్ చేయగలిగారు.

తన బలగాలను వాడి కేసీఆర్ అప్పట్లో చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న ఆర్థిక మూలాల పైన తన కంట్రోల్ తీసుకు రాగలిగారు. తద్వారా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ చేయగలిగారు. ఎక్కడా కూడా మనీ అనేది టర్న్ అవ్వకుండా డబ్బులు ఒకరి నుంచి మరొకరికి వెళ్లకుండా అప్పుడు కేసీఆర్ వై.యస్.జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేశారు. ఇప్పుడు అదే హెల్ప్ ని రేవంత్ రెడ్డి కూడా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి ఫేవర్ గా చేయబోతున్నారు అంటూ కొత్త రూమర్ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దీనిని ఎక్కువగా వైరల్ చేస్తున్నాయి.

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా చంద్రబాబును తక్కువ చేసి మాట్లాడలేదు. అందువల్లే తెలుగుదేశం క్యాడర్ కూడా కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి ఎంతో కొంత దోహదం చేసింది. తెలుగుదేశం క్యాడర్ ఎప్పుడు తనతోనే ఉండాలంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రాంతంలో బెనిఫిట్ ఉంటుందని గుర్తించిన రేవంత్ రెడ్డి ఒకప్పుడు కేసీఆర్ వైసీపీకి చెందిన ఆర్థిక మూలాలను కంట్రోల్లో తీసుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని టార్గెట్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది