Home » Andhra Pradesh » Roja As A Mp In Elections 2024
andhra pradesh

Roja : ఈసారి న‌గ‌రి నుంచి కాదు.. ఎంపీ బ‌రిలో రోజా..?

Authored By
aruna
The Telugu News | Updated on: January 29, 2024 10:23 am
Advertisement

Roja : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమర శంఖం పూరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 మంది అభ్యర్థుల స్థానాలను మార్చిన సీఎం జగన్…తుది జాబితా పై కూడా కసరత్తు మొదలుపెట్టారు. ఇక దీనిలో భాగంగానే ఎంపీల జాబితా ఎట్టకేలకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం మాజీమంత్రి రోజాపై నగరిలో సొంత పార్టీ వైసీపీ నుండి వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో నగరి నుండి రోజాను మార్చేసి పార్లమెంట్ బరిలో దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తున్న జగన్ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సీటు లేకుండానే చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంట సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అదేవిధంగా జిల్లాలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపించగా జిల్లా నేతల నుండి సానుకూలత కనిపించలేదు. దీంతో మరో అభ్యర్థి కోసం పార్టీ నేతలు అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే నగరి నుంచి మంత్రి రోజా పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒకే కుటుంబం నుండి రెండు సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు అభిప్రాయ వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంట్ కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా అభ్యర్థిత్వంపై జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయి రెడ్డి చర్చించడం జరిగింది. ఇక జిల్లా నేతల నుండి సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలో దించేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బాలినేని , బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీటు కేటాయింపు పై సీఎంతో మాట్లాడాలని భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై ముందుగా సాయి రెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.రోజాతో కూడా ఇప్పటికే ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై మంత్రి రోజా జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారట. దీంతో నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఒంగోలు నుండి మంత్రి రోజా ఖరారు పై సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తెలియజేసే అవకాశం ఉంది.ఇక ఇదే సమయంలో రోజా ను నగరి నుంచి మార్చి అక్కడ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు జాబితా మరింత ఆలస్యం కాకుండా మరొ ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి