RK Roja : నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి రోజా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RK Roja : నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి రోజా..!

 Authored By anusha | The Telugu News | Updated on :23 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  RK Roja : నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి రోజా..!

RK Roja : మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే ఇరుపాక్ష పార్టీలు పోటా పోటీగా మాటల యుద్ధం చేస్తున్నాయి. ఇక మంత్రి రోజా నారా లోకేష్ చేసిన పాదయాత్ర పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు జగనన్న పాదయాత్రను చూసి నారా లోకేష్ పాదయాత్ర చేశాడని విమర్శించారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అని చెప్పి కనీసం 40 కిలోమీటర్లు కూడా కంటిన్యూగా నడవలేదని రోజా ఆరోపించారు. 200 రోజుల పాదయాత్రలో కనీసం 200 సార్లు అయినా బ్రేక్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దని అంటున్న సిగ్గు లేకుండా వచ్చి పిల్లలు, ప్రజలు సుఖంగా ఉంటే చూసి సహించలేక టీడీపీ వాళ్ళు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

పిల్లలంతా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని వైసీపీ ప్రభుత్వం ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్ లో పిల్లలు అశ్లీల వీడియోలు చూసి చెడిపోతున్నారని సిగ్గు లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా సీరియస్ అయ్యారు. పిల్లలు చదువుకోవాలని చక్కని ఉద్దేశంతో జగనన్న 33,000 విలువగల టాబ్స్ పిల్లలకు అందిస్తున్నారు. ఈ టాబ్స్ లో సబ్జెక్టు తప్ప మరేమీ ఉండవు. యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో అసలే ఉండవు. ప్రతిపక్షాలు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి లోకేష్ బాగా చూస్తాడు అనుకుంటా అందుకే అతడికి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అని నారా లోకేష్ పై రోజా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేష్ ఐరన్ లెగ్ అని పాదయాత్ర మొదలుపెట్టిన రోజే తెలిసింది. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు తారకరత్న మరణించారు. దీంతో రారా లోకేష్ ఐరన్ దగ్గర అని తెలిసిపోతుంది అని రోజా అన్నారు. ఏపీలో కన్నా హైదరాబాద్ ఢిల్లీకే తిరుగుతూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేదు. విద్య, వైద్య రంగంలో ఎటువంటి ఖర్చు లేకుండా పిల్లలకి అందిస్తున్నారు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నాలుగు కోట్ల ఓటర్లు నలుగురు నాన్ లోకల్ లీడర్ల మధ్య జరగనున్నాయని..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ను ఏపీ ప్రజలు తరిమి కొడతారని మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది