Roja : పవన్ కళ్యాణ్‌పై రోజా ఫైర్..“సినిమాల కోసమే డిప్యూటీ సీఎం అయ్యారా?”
ప్రధానాంశాలు:
Roja : పవన్ కళ్యాణ్‌పై రోజా ఫైర్..“సినిమాల కోసమే డిప్యూటీ సీఎం అయ్యారా?”
Roja : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార కూటమి నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల నేపథ్యంలో, మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

Roja : పవన్ కళ్యాణ్‌పై రోజా ఫైర్..“సినిమాల కోసమే డిప్యూటీ సీఎం అయ్యారా?”
Roja : రోజా ఆగ్రహం..
మీడియాతో మాట్లాడుతూ రోజా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏవేవో డైలాగులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎక్కడున్నారు? సినిమా షూటింగ్లు, డబ్బింగ్‌లలో తిరుగుతున్నారు. ఇది ప్రజలకు ఇచ్చిన గౌరవమా?” అంటూ ధ్వజమెత్తారు. “రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వంలో మీరు డిప్యూటీ సీఎం అయ్యారు.
అయితే నిజంగా ఆ బాధ్యతలపై మీకు శ్రద్ధ ఉందా? లేకపోతే పదవి వదిలేసి పూర్తిగా సినిమాలకే వెళ్లిపోండి” అని రోజా మండిపడ్డారు. “సుగాలి ప్రీతి కేసు గురించి ఎన్నికల సమయంలో ఎంతో గట్టిగా మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తల్లిని ఒక్కసారి కలిసారా? అసలు ఆ విషయం గురించి మాట్లాడుతూనే లేరు. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని ప్రశ్నించారు.