Roja : 24 కుక్క బిస్కెట్ల కోసం తోక ఊపుకుంటు వెళ్లావా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రోజా సెటైర్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : 24 కుక్క బిస్కెట్ల కోసం తోక ఊపుకుంటు వెళ్లావా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రోజా సెటైర్లు..!

Roja : అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసారు. 99 మందితో మొదటి జాబితా విడుదల చేశారు. పొత్తులో భాగంగా జనసేన కోసం 24 సీట్లు కేటాయించగా 5 స్థానాలకు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే జనసేనకు 24 సీట్లేనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీ సైతం టీడీపీ, జనసేన […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 February 2024,8:15 pm

ప్రధానాంశాలు:

  •  Roja : 24 కుక్క బిస్కెట్ల కోసం తోక ఊపుకుంటు వెళ్లావా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రోజా సెటైర్లు..!

Roja : అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసారు. 99 మందితో మొదటి జాబితా విడుదల చేశారు. పొత్తులో భాగంగా జనసేన కోసం 24 సీట్లు కేటాయించగా 5 స్థానాలకు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే జనసేనకు 24 సీట్లేనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీ సైతం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా పై విమర్శలు చేయడం ప్రారంభించింది. ఇక మంత్రి రోజా ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ, జనసేన తొలి జాబితా పై కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద సెటైర్లు వేశారు. పావలా సీటు కూడా తెచ్చుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు అంటూ ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఏడుస్తున్నారు. పవర్ షేరింగ్ సీట్ షేరింగ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ పావలా షేర్ కూడా తెచ్చుకోలేకపోయారంట. బిస్కెట్లు వేస్తే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారని విమర్శలు చేశారు. 24 సీట్లు చాలని పవన్ కళ్యాణ్ ఎందుకు తల ఊపారో, ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తలవంచారో, పవర్ స్టార్ కాస్త పవర్ లేని స్టార్ అయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని గందరగోళం లో పార్టీలో ఉన్నాయి. 118 సీట్లు ప్రకటించిన ఇంకా గందరగోళం నెలకొంది.

కనీసం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని విషయంలో క్లారిటీ లేదు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబునాయుడు కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ ని చూస్తే జాలేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పడే సీటు తీసుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ పడిపోయారని టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే సరిపోతుందంటూ సెటైర్లు గుప్పించారు.జనసేన పోటీ చేసే 24 సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థులే ఉంటారని సజ్జల అన్నారు. 24 మందితో ఏ యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్ కు లేవని సజ్జల విమర్శించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది