Roja : పవన్ కల్యాణ్‌కి మానసిక స్థితి బాగాలేదంటూ రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో
ప్రధానాంశాలు:
పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడో..ఎక్కడ పెరిగాడో ఆయనకే తెలియదు - రోజా
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ "వీకెండ్ నాయకులు" - రోజా
Roja : పవన్ కల్యాణ్‌కి మానసిక స్థితి బాగాలేదంటూ రోజా సంచలన వ్యాఖ్యలు
Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన “రీకాలింగ్ చంద్రబాబు” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు గాలిలో గెలిచినవారేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను “వీకెండ్ నాయకులు”గా అభివర్ణించిన రోజా, వీళ్లలో ఒక్కరు కూడా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు అడగడం లేదని మండిపడ్డారు. గోవుల మరణాల అంశం, శ్రీశైలంలో తాబేలు చనిపోయిన ఘటనలను ప్రస్తావిస్తూ, వీటిపై బాధ్యత తీసుకోకుండా తమిళనాడుకు వెళ్లడంటూ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Roja : పవన్ కల్యాణ్‌కి మానసిక స్థితి బాగాలేదంటూ రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో
Roja : పవన్ కళ్యాణ్ గాలి నేత అంటూ రోజా కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ చెప్పిన “నాకు కొంచెం తిక్క ఉంది.. దానికి లెక్క ఉంది” అనే డైలాగ్‌ను ఆసరాగా తీసుకోని విమర్శించిన రోజా, ఇప్పుడు ఆ తిక్క ముదిరిపోయిందని, చంద్రబాబు డబ్బులు పెడుతున్నారని అందుకే పవన్‌కు పిచ్చి పెరిగిందని ఆరోపించారు. “ఎక్కడికెళ్లినా అక్కడే పుట్టాను” అని చెప్పే పవన్‌కి మానసిక స్థితి బాగా లేదంటూ రోజా మండిపడ్డారు. అతను నటనతో ప్రజలను మోసగిస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వారాంతాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, తన పనులపై దృష్టి పెడుతున్నాడని, ప్రజల సమస్యలపై ఆసక్తి లేదని ఆరోపించారు.
తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వచ్చి అధికారంలోకి వస్తే, ప్రతిపక్ష నాయకులు అమెరికా పారిపోతారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు, పెట్టిన బాధలు వడ్డీతో సహా తిరిగి తిరిగిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంచలనానికి దారి తీశాయి.
రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలి నా**కులు ఎక్కువైపోయారు.#PawanKalyan తమిళనాడు వెళ్ళి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను అంటున్నాడు. అసలు ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడో క్లారిటీ లేదు.
తమిళనాడు వెళ్ళి తిరుత్తని మురుగన్ నా అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయన పిచ్చి… pic.twitter.com/TeC81jJTQY
— greatandhra (@greatandhranews) July 22, 2025