Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీలను అడ్డుకున్న స్థానిక ప్రజలు..!
ప్రధానాంశాలు:
పుష్కరకాల్వ పునాదులనే తవ్వేస్తున్న ఘనులు.. అర్థరాత్రి అడ్డుకున్న స్థానికులు
చోద్యం చూస్తున్న అధికారులు
Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీలను అడ్డుకున్న స్థానిక ప్రజలు..!
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ పనులు, పుష్కర కాల్వ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు వందల లారీలతో అక్కడ మట్టిని స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బల రామక్రష్ణ అనుచరులు తరలించుకుపోతున్నారు. వీరి ఆగడాలు భరించలేని స్థానిక ప్రజలు అర్థరాత్రి…లారీలను అడ్డుకుని, మట్టి మాఫియాపై తిరుగుబాటు చేశారు. ప్రజల్లో చైతన్యం రావడంతో రాత్రికి రాత్రి వార్త వైరల్ అయిపోయింది. ఎంతో ఘనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న దందాలు రోజురోజుకి శృతిమించుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కాల్వలు ఆక్రమించినా, నీళ్లు వెళ్లే మార్గాన్ని ఆపినా సహించేది లేదని వార్నింగులు ఇచ్చారు.

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీలను అడ్డుకున్న స్థానిక ప్రజలు..!
Sand Mafia : పుష్కరకాల్వ పునాదులనే తవ్వేస్తున్న ఘనులు.. అర్థరాత్రి అడ్డుకున్న స్థానికులు
కానీ సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ క్రష్ణ సారథ్యంలో ప్రతిష్టాత్మకమైన పోలవరం కాల్వ, పుష్కర కాల్వల మట్టిని అడ్డగోలుగా తరలిస్తుంటే.. ఆయన చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకి 100 లారీలకు పైనే నాన్ స్టాప్ గా తిరుగుతున్నాయని, అడిగేవాడు, ఆపేవాడే లేడని కలవచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది సంబంధిత అధికారులకు విన్నవించినా తేలు కుట్టిన దొంగల్లా అందరూ గమ్మున ఉంటున్నారు కానీ, ఎవరూ పట్టించున్న పాపాన పోలేదని సీరియస్ అవుతున్నారు. రోజూ అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒకరిని అత్యవసరంగా 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుంటే, ఈ మట్టి లారీల వల్ల…రెండు గంటలు ఆలస్యంగా వెళ్లామని, దీంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్కర కాల్వ కోసం తవ్విన మట్టిని తీస్తే పర్వాలేదు, మొత్తం కాల్వ పునాదులనే తవ్వి తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇలా జరిగితే, గట్లు బలహీనంగా మారతాయని, రేపు కాల్వలకు నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి… ఊళ్లకు ఊళ్లే మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలందరూ ఏకమై తిరుగుబాటు చేశామని అన్నారు. మొత్తానికి మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలపై వార్తలు రావడంతో ఎక్కడి దొంగలక్కడే గప్ చుప్ అన్నట్టు అయిపోయారు. మరి ఈ ఘటన నేపథ్యంలో రేపు కూటమి నేతలు ఎలా బదులిస్తారో చూస్తామని ప్రజలు అంటున్నారు. అయినా ఆపకపోతే ఆందోళన ఉధ్రతం చేస్తామని హెచ్చరించారు. మంచి ప్రభుత్వమని ఓట్లే సి గెలిపిస్తే, మా మంచిగా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నెట్టింట్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
