Nimmagadda Ramesh: లోపలికి కాలు పెట్టడానికి కూడా వీల్లేదు – నిమ్మగడ్డ సంచలన షాక్ ఇచ్చాడు వాళ్ళకి !
Nimmagadda Ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న చర్యల కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కోపంతో రగిలి పోతున్నారు. ఇప్పటికే కోపంతో ఉన్న మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పవర్ కట్టింగ్ పెట్టడంతో వారు మరింతగా ఉడుక్కుంటున్నారు. క్యాబినేట్ హోదాలో ఉన్న ప్రభుత్వ సలహా దారులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా వారి అధికారాలను పూర్తిగా పక్కకు పెట్టి మాత్రమే పార్టీ పరమైన ప్రచారంలో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ప్రచారంకు వెళ్లిన సమయంలో అధికారులు పక్కన ఉండకూడదు అంటూ ఆదేశించారు. గ్రామాల లోపలకు కాలు పెట్ట కూడదు అంటూ సీరియస్ గా ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
Nimmagadda Ramesh: వైకాపా మంత్రులకు అస్సలు నచ్చడం లేదు..
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల విషయంలో అధికారులు జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లోకి అధికారులు వెళ్ల కూడదు అనేది రూల్. కాని ప్రతి సారి ఇది ఏమీ అమలు అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కాని ఈసారి మాత్రం ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారుల విషయంలో సీరియస్ గా ఉంటున్నాడు. అది వైకాపా మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదు.
ప్రభుత్వ సలహాదారులకు షాక్..
ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారులకు క్యాబినెట్ హోదా ఉంటుంది. కనుక వారు కూడా ఎన్నికల విషయంలో పట్టించుకోవద్దని, ఒక వేళ ఎన్నికల ప్రచారంకు వెళ్లాలి అంటే ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు అలాగే ప్రభుత్వ అధికారులను వెంట పెట్టుకుని వెళ్ల కూడదు అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై ప్రభుత్వ సలహాదారు కూడా అసంతృప్తితో ఉన్నారు. అధికార వైకాపాను నిమ్మగడ్డ రమేష్ కట్టడి చేస్తున్న తీరు తెలుగు దేశం పార్టీ నాయకులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మాత్రమే గ్రామాల్లో అడుగు పెట్టాలని, ప్రభుత్వ అధికారులు ఎవ్వరు కూడా గ్రామాల్లో అడుగు పెట్టవద్దని సీరియస్ వార్నింగ్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వడంతో మరింత రసవత్తరంగా ఎన్నికల నిర్వహణ సాగుతోంది.