Ys Jagan : వైఎస్ జగన్ మరో పెద్ద తప్పు చేయబోతున్నాడా..?
Ys jagan : ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య జరిగిన పోరు ఎలాంటిదో అందరికి తెలిసిన విషయమే, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇద్దరి మధ్య రాజుకున్న నిప్పు ఎంతటి సంక్షోభానికి దారితీసిందో చూశాం. దీనితో మరోసారి తనకు ఎస్‌ఈసీ కి మధ్య అలాంటి పరిస్థితులు తలెత్తకుండానే ఆలోచనలో జగన్ మరో పెద్ద తప్పు చేయబోతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. దీనితో కొత్త ఎస్‌ఈసీ గా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకోవాలని సీఎం జగన్ భావించి, అందుకు తగ్గట్లు ఎం శామ్యూల్, నీలం సాహ్నీ మరియు ఎల్ ప్రేమచంద్ర రెడ్డి అనే ముగ్గురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారుల పేర్లు గవర్నర్ కు ఏపీ సర్కార్ పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ముగ్గురిలో శామ్యూల్ ను ఎస్‌ఈసీ గా నియమించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన.. జగన్ తోపాటు దివంగత వైయస్ఆర్ కింద నమ్మకంగా పనిచేశారు.అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. శామ్యూల్ యొక్క గత చరిత్ర అంతగా బాగాలేదని శ్యామ్యూల్ గతంలో జగన్ కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. అందులోనూ.. జగన్ కేసులే కాకుండా మరో రెండు కేసుల్లో శామ్యూల్ నిందితుడు. మరి రాజ్యాంగ బద్ద పదవి కోసం ఇలాంటి అధికారిని ఎలా సిఫారసు చేస్తారని ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తోంది.
పైగా శామ్యూల్ వయసు 67 సంవత్సరాలు కేంద్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి టాస్క్ఫోర్స్ తాజా సిఫార్సు ప్రకారం ఎస్ఇసి యొక్క గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. దాని ప్రకారం చూసుకున్న శామ్యూల్ ఈ పదవి అర్హుడు కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ శామ్యూల్ కావాలని ప్రభుత్వం పట్టుపడితే కేంద్ర నిబంధనల కారణంగా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. చూద్దాం మరి కొత్త ఎస్‌ఈసీ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..!