Roja VS Selvamani : రోజాని పక్కన పెట్టి తన భర్త సెల్వమణికి టికెట్.. రోజా ఖేల్ ఖతం?
Roja VS Selvamani : టైటిల్ చూడగానే షాక్ అయ్యారా? మీరు చదివింది నిజమే. కానీ..ఇది జరుగుతుందా అనే అనుమానం మీకు వస్తుంది. ఎందుకంటే.. ఆర్కే రోజా అంటేనే వైసీపీలో ఫైర్ బ్రాండ్. మరి అలాంటి రోజా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పుకోవాలి. అసలే ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు మంత్రి కూడా. జగనన్నకు సన్నిహితురాలు. అందులోనూ జగనన్నపై ఈగను కూడా వాలనివ్వరు రోజా. అలాంటి రోజాకి జగన్ ఎందుకు టికెట్ ఇవ్వరు అనే అనుమానాలు కలుగుతాయి కానీ.. అసలు విషయం ఏంటో తెలిస్తే అర్రె అనుకోవాల్సి వస్తుంది మనం.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం రోజా నియోజకవర్గం నగరి. 2014 లోనూ ఆమెనే అక్కడ గెలిచారు. కానీ.. 2014 లో వైసీపీ ప్రభుత్వం రాలేదు. కాబట్టి ఆమెకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. 2019 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రోజాకు టికెట్ ఇచ్చారు జగన్. దీంతో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా రెండేళ్ల తర్వాత మంత్రి పదవి పొందారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అంతా బాగానే ఉంది కానీ.. 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? గెలిచే దమ్ము ఉందా? అనేదే పెద్ద అనుమానం. అందులోనూ ప్రస్తుతం నగరిలో టీడీపీ పుంజుకుంది. ఇప్పుడు అక్కడ గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబానికి బలం బాగా ఉంది. అందుకే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ రోజాను నిలబెడితే ఆమె గెలుస్తారా? అనే అనుమానం వైసీపీ హైకమాండ్ కు కలుగుతోంది.
Roja VS Selvamani : సొంత నియోజకవర్గంలోనే ప్రత్యర్థులు
ఇవన్నీ పక్కన పెడితే రోజాకు తన సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ నుంచి ప్రత్యర్థులు తయారయ్యారు. దానికి కారణాలు అనేకం. సొంత నియోజకవర్గం నేతలను రోజా పట్టించుకోవడం లేదనే అపవాదు చాలా రోజుల నుంచి ఉంది. ముఖ్యంగా తను మంత్ర అయినప్పటి నుంచి అది ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమెకు మళ్లీ టికెట్ ఇస్తే మేమే ఓడిస్తాం అని అధికార పార్టీ నాయకులే అంటున్నారు. అలాగే.. టీడీపీకి కూడా గ్రాఫ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు కాకుండా.. ఆమె భర్తకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోందట. అలా చేస్తే రోజా ఫ్యామిలీకే టికెట్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే.. నగరిలో ఎక్కువగా ఉన్నది కూడా మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన వారే. సెల్వమణి కూడా ఆ సామాజిక వర్గానికే చెందిన వారు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చి నగరిలో మరోసారి వైసీపీ విజయకేతనం ఎగురవేయాలని చూస్తోందట. చూద్దాం మరి ఏం జరుగుతుందో?