Ys Jagan : చంద్రబాబు నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్ళు పుట్టారా..? వైఎస్ జగన్.. వీడియో !
ప్రధానాంశాలు:
కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉండకూడదా..? చంద్రబాబు - జగన్
చంద్రబాబు.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?
నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్ళు పుట్టారు అనుకుంటున్నావా?
Ys Jagan : సత్తెనపల్లి రెంటపాళ్లలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన కమ్మవారిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం చంద్రబాబుకే కమ్మవారు సహాయం చేయాలని బలవంతపెట్టడం, ఇతర పార్టీలలో ఉన్నవారిపై వేధింపులకు దిగడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “కమ్మవారు పుట్టింది చంద్రబాబుకి ఊడిగం చేయడానికేనా?” అంటూ జగన్ నిలదీస్తూ ప్రశ్నించారు.

Ys Jagan : చంద్రబాబు నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్ళు పుట్టారా..? వైఎస్ జగన్.. వీడియో !
Ys Jagan : కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? – చంద్రబాబు
దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, తలశిల రఘురాం, ఇంటూరి రవి వంటి నేతలపై అసత్య కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. వారు ఏ తప్పూ చేయకపోయినా, కేవలం వైఎస్సార్‌సీపీలో ఉన్నారని కోపంతో తప్పుడు కేసుల్లో ఇరికించారని విమర్శించారు. మహిళ అయిన కృష్ణవేణిపై జరిగిన దౌర్జన్యాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలన్నీ రాజకీయ పగలు, కక్షసాధింపులేనని జగన్ స్పష్టం చేశారు.
రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య విషయంలో జగన్ తీవ్రంగా స్పందించారు. “ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారని అడుగుతున్నా.. అతనిని ఆత్మహత్య చేసుకునే స్థితికి నెట్టినదెవరు?” అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే వైఎస్సార్‌సీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను కూడా అంతే పరిస్థితిలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని స్పష్టం చేస్తూ, తన పార్టీ కార్యకర్తల పట్ల జరుగుతున్న పోలీసుల అరాచకాలకు అంతు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.
నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు
కమ్మ వాళ్ళు నీకు ఊడిగం చేయటానికి పుట్టారా చంద్రబాబు..?
నువ్వు.. నీకు తోడు ఒక ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి అంత ఒక్క దొంగల ముఠా
మీరు అంత రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్న దాన్ని పంచుకోవడం – మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/G8o59W8sjj
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2025