Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2026,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా ‘పూజిత రెడ్డి’ ప్రవేశించింది. ఆ పరిచయం కాస్తా మూడేళ్ల ప్రేమగా మారింది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఆ మూడేళ్లలో అతను ఒక్కసారి కూడా ఆమె ముఖం చూడలేదు. చివరకు ఆ “కంటికి కనిపించని ప్రియురాలి” కోసం ఏకంగా రూ. 81.67 లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు.

Software Engineer : అసలు కథ ఇదీ..

Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గూడెం గ్రామానికి చెందిన అశోక్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రామలింగారెడ్డి అనే వ్యక్తి అశోక్ సంపాదనపై కన్నేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ మానసతో పూజిత రెడ్డి పేరుతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేయించి అశోక్ కు వల విసిరాడు. రామలింగారెడ్డి స్వయంగా అశోక్ దగ్గరకు వెళ్లి “ఆ పూజిత చాలా మంచి అమ్మాయి” అని నమ్మబలికాడు.

Software Engineer : బ్లాక్ మెయిలింగ్.. అప్పులు..

మొదట అక్క పెళ్లి అని, తర్వాత ఇల్లు కడుతున్నామని చెబుతూ విడతల వారీగా అశోక్ నుంచి డబ్బులు లాగడం మొదలుపెట్టారు. అశోక్ తన ఊరిలో రూ. 15 లక్షలు అప్పు చేయడమే కాకుండా, చెన్నైలోని తన కొలీగ్స్ దగ్గర కూడా అప్పులు చేసి వీరికి పంపాడు. ఒకానొక దశలో అశోక్ డబ్బులు ఇవ్వలేనంటే.. మానస (పూజిత రెడ్డి) చేతులు కోసుకున్న ఫోటోలు పంపిస్తూ, చచ్చిపోతానని బెదిరిస్తూ అతన్ని మానసికంగా హింసించి డబ్బులు గుంజిందని బాధితుడు వాపోయాడు.

Software Engineer : గుట్టు రట్టు..

కొన్ని రోజుల తర్వాత పూజిత నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అశోక్ ఆరా తీయగా.. తాను ప్రేమించింది తన ఊరి వ్యక్తి రామలింగారెడ్డి గర్ల్ ఫ్రెండ్ మానసని, ఇదంతా ఒక పక్కా ప్లాన్ అని తెలుసుకుని షాక్ అయ్యాడు. మోసపోయానని గ్రహించిన అశోక్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నాడు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి