AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
AP Politics : మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ.. ఏపీలో మాత్రం దారుణంగా ఉన్నాయి. మొన్నటి వరకు మాటల వరకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు దాడుల వరకు వచ్చాయి. మొన్న విజయవాడలో రాత్రి బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్ మీద అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో జగన్ ఎడమ కనుబొమ్మ మీద గాయం అయింది. అయితే ఇదంతా వైసీపీ స్క్రిప్టు ప్రకారమే జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అందరూ ఖండించాల్సిందే.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని ఖండించారు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వైసీపీ ఆడుతున్న డ్రామా అని అంటున్నాయి. కానీ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షమే దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రోజు తేడాలో నిన్న ఆదివారం నాడు అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు మీద కూడా రాళ్లు విసిరారని వార్తలు వచ్చాయి.
కానీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మరి ఇలా అగ్ర నేతలపై రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఎవరూ కూడా ప్రత్యర్థులను ప్రతిపక్ష నేతలుగా చూడట్లేదు. శత్రువులుగానే చూస్తున్నారు.ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. దారుణాతి దారుణంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి రాగానే మిమ్మల్ని గుడ్డలూడదీసి కొడుతాం అని ఒకరు అంటారు. మేం గెలిస్తే మీరు జైలుకే అని ఇంకొకరు అంటారు. ఇంట్లోకొచ్చి కొడుతాం అని ఒకరంటారు. ఇలా తమ స్థాయిని మర్చి మపోయి మరీ హింసాత్మక మాటలు మాట్లాడుతున్నారు. దాంతో వారి పార్టీలో ఉన్న కేడర్ కూడా మైండ్ లోకి అదే ఎక్కించుకుంటున్నారు. తమ నాయకులు మాట్లాడిన మాటలకు వారు రెచ్చిపోయి దాడులకు తెగ బడుతున్నారు.
AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
అందుకే ఇప్పుడు ఈ రాళ్ల దాడులు అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సమయాలనే సంఘ విద్రోహ శక్తులు అలవుగు మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్లు వాటిని మరింత హింసాత్మకంగా మార్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయాలను పార్టీల అధ్యక్షులు పట్టించుకోవట్లేదు. ఎంత సేపు వారి స్వార్థం, వారి అధికారం కోసమే మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు తాము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే రోజుల నుంచి.. మేం గెలిస్తే మిమ్మల్ని బొంద పెడుతాం, జైలుకు పంపుతాం అని చెప్పుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా అగ్ర నేతలు ఆచితూచి మాట్లాడాలని, తమ కేడర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.