TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు… 50 సీట్ల‌లో ఆధిక్యం..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 4 June 2024, 9:19 am
  •  TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు... 50 సీట్ల‌లో ఆధిక్యం..!

TDP Lead : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 21 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైఎస్సార్ సీపీ 1 చోటు ఆధిక్యంలో ఉంది. రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవీఎం తొలి రౌండులో 91 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు. మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 617 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1500 ఓట్ల లీడ్లో ఉన్నారు.

TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు... 50 సీట్ల‌లో ఆధిక్యం..!

TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు… 50 సీట్ల‌లో ఆధిక్యం..!

గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జగ్గంపేట తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి