YS Jagan : కడప జడ్పీ పీఠంపై కూటమి కన్ను.. మరి జగన్ కాపాడుకుంటాడా..?
ప్రధానాంశాలు:
YS Jagan : కడప జడ్పీ పీఠంపై కూటమి కన్ను.. మరి జగన్ కాపాడుకుంటాడా..?
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాప్ టు బాటమ్ కూటమి ప్రభుత్వం మాత్రమే కనిపించేలా, వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని కూటమి పంతం పట్టింది. ఏపీలో టీడీపీ కూటమి వైసీపీ ఆధీనంలో ఉన్న ఒక్కో మునిసిపాలిటీ, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ లను ఒక వ్యూహం ప్రకారం లాగేసుకుంటుంది.ఈ క్రమంలో కూటమి పెద్దల కన్ను కడప మీద పడింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే వైస్ఎస్ జగన్‌కి గట్టి దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. కడప జడ్పీలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అదులో రెండు ఖాళీలు కాగా మిగిలిన 48 జడ్పీటీసీలలో 47 మంది వైసీపీకి చెందినవారే కావడం గమనార్హం.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయిదుగురు జడ్పీటీసీలు టీడీపీలో, అలాగే ఒక జడ్పీటీసీ బీజేపీలో చేరారు. అంటే ఇపుడు కడప జడ్పీలో వైసీపీ బలం 41.ఈ పరిణామంతో వైసీపీ నాయకత్వం అలెర్ట్ అయింది. కడప జిల్లా పరిషత్‌కు చెందిన జడ్పీటీసీలు అందరిని రమ్మంటూ హై కమాండ్ నుంచి పిలుపు వెళ్లింది. వారందరినీ ఈ నెల 21న జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో కలవబోతున్నారు. ఈ సమావేశం ద్వారా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కడప జడ్పీ పీఠం చేజారకుండా జగన్ వ్యూహ రచన చేయనున్నట్లు చెబుతున్నారు.
కాగా జడ్పీ పీఠం కైవసానికి మెజారిటీ సంఖ్యా బలం 25. కూటమికి ఏడుగురు ఉన్నారు. మిగిలిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. దాంతో ఉలిక్కిపడిన వైసీపీ హై కమాండ్ కడప కంచు కోటను నిలబెట్టుకునేందుకు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జగన్ వ్యూహ రచన ఏ మేరకు సఫలం కానుందో చూడాల్సిందే.