Somireddy : సోమిరెడ్డికి టికెట్ ఉందా లేదా ..?? టీడీపీ ప్లాన్ ఏంటి..??
Somireddy : వరుసగా ఓటమి చెందుతూ వచ్చిన నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య సీనియర్ నేతలకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో వరుసగా 5 సార్లు ఓటమి చెందిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి లోకేష్ వ్యాఖ్యలకు తీవ్ర ఆందోళనలో పడ్డారు. 2004 ఎన్నికల నుంచి వరుసగా ఏ ఎన్నికల్లో గెలవలేదు. చివరికి ఎమ్మెల్సీ అయ్యి […]
ప్రధానాంశాలు:
Somireddy : సోమిరెడ్డికి టికెట్ ఉందా లేదా ..?? టీడీపీ ప్లాన్ ఏంటి..??
Somireddy : వరుసగా ఓటమి చెందుతూ వచ్చిన నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య సీనియర్ నేతలకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో వరుసగా 5 సార్లు ఓటమి చెందిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి లోకేష్ వ్యాఖ్యలకు తీవ్ర ఆందోళనలో పడ్డారు. 2004 ఎన్నికల నుంచి వరుసగా ఏ ఎన్నికల్లో గెలవలేదు. చివరికి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవిలో కొనసాగాల్సి వచ్చింది. ఈసారి కూడా సర్వేపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్న సోమిరెడ్డికి నారా లోకేష్ బ్రేక్ వేశారని తెలుస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గం లో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారి పోతుంది. ముఖ్య నేతలు అందరూ మంత్రి కాసాని గోవర్ధన్ రెడ్డికి జై కొడుతున్నారు. ఒక్కొక్కరిగా టీడీపీకి గుడ్ బై చెప్పేసీ వైసీపీలోకి చేరుతున్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైఖరి నచ్చక కొందరు ఆ పార్టీ ఇంకా అధికారంలోకి వచ్చేది లేదని డిసైడ్ అయిపోయారు. మరికొందరు మంత్రి కాసాని వెంట నడుస్తున్నారు. క్యాడర్ చెదిరిపోవడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి టికెట్ భయం పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో సీనియర్లకు టికెట్ ఇచ్చేది లేదని లోకేష్ అనడంతో సోమిరెడ్డి అంతర్గత మదనంలో పడ్డారట. అతడి స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుందట. మాజీ మంత్రి సోమిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదు అంటూ సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సోమిరెడ్డి టికెట్ పై క్లారిటీ కోసం చంద్రబాబును కలిసారట. సొంత నియోజకవర్గ రాజకీయాలు వదిలేసి పక్క నియోజకవర్గాల్లో ఎందుకు తిరుగుతున్నారని లోకేష్ సోమిరెడ్డిని ప్రశ్నించారట. జిల్లాలో నీవల్లే పార్టీ నాశనం అవుతుందని లోకేష్ తీవ్రవీఖ్యాలు చేశారట.
పార్టీ నేత చంద్రబాబు వద్దనే తన టికెట్ సంగతి తేల్చుకోవాలని సోమిరెడ్డి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు సోమిరెడ్డికి టికెట్ లేదని వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎదుర్కొనే స్థాయి సోమిరెడ్డికి లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తుందని ప్రచారం జరుగుతుంది. జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు కాకాని పై పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని, నాలుగేళ్లలో నియోజకవర్గంలో ముఖ్యమైన నేతలు వైసీపీలో చేరడం, సోమిరెడ్డి పై అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉండడంతో అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టిందట. సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రమే తిరగాలని, బయట నియోజకవర్గం లో వేలు పెట్టొద్దని మాజీ మంత్రి సోమిరెడ్డికి టీడీపీ పార్టీ హై కమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. ఇక సోమిరెడ్డికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రావడం కష్టమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.