Andhra Pradesh : మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్న కూటమి సర్కార్

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది. గతేడాది నవంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నవంబర్ నుంచి 2024 మార్చి వరకు లబ్ధిదారులకు ఒక్కో ఉచిత సిలిండర్ అందించగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచి ప్రతీ సంవత్సరంలో మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కొత్త విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇంతకుముందు లబ్ధిదారులు సిలిండర్ పొందిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌గా డబ్బులు తీసుకునేవారు. కానీ ఇకపై ప్రభుత్వం నాలుగు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఉదాహరణకు ఆగస్టులో రెండవ ఉచిత సిలిండర్ అందుకునే వారు ముందుగానే తమ ఖాతాలో రూ.900 పొందవచ్చు. అదే విధంగా డిసెంబరులో మూడవ సిలిండర్‌కు సంబంధించిన డబ్బు ఖాతాలో చేరుతుంది.

ప్రస్తుతం 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర సుమారుగా రూ.850 నుంచి రూ.950 వరకు ఉంది. ప్రభుత్వం సగటు ధర రూ.900గా నిర్ణయించి, ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక సంవత్సరానికి మూడు సిలిండర్లకు రూ.2,700 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఈ విధానం వల్ల మహిళలు ముందుగానే సిలిండర్ కొనుగోలు చేసేందుకు సులభతరం అవుతుంది. సీఎం చంద్రబాబు స్వయంగా దీన్ని ప్రకటించడమే కాకుండా, దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. ఈ మార్పుతో మహిళలకు ఆర్థిక భారం తక్కువ అవుతుండడం తో పాటు గృహ అవసరాలు మరింత సులభంగా మారనున్నాయి.

Recent Posts

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

24 minutes ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

1 hour ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

2 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

3 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

5 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

6 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

8 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

9 hours ago