చంద్రబాబు మగాడు.. లక్ష్మీపార్వతి పతివ్రత .. షాకింగ్ కామెంట్స్ చేసిన టీడీపీ నేత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

చంద్రబాబు మగాడు.. లక్ష్మీపార్వతి పతివ్రత .. షాకింగ్ కామెంట్స్ చేసిన టీడీపీ నేత

 Authored By brahma | The Telugu News | Updated on :21 March 2021,10:10 am

TDP : మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ ను తీవ్రమైన పదజాలలతో తిట్టిన విషయం తెలిసిందే, దీనికి కౌంటర్ గా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, తండ్రి శవపు ముద్దలను పక్కనపెట్టుకొని అధికారంకోసం బేరాలాడినవారు కాదు. తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కనీసం తలనొప్పికూడా రాలేదు. చంద్రబాబు మగాడు కాబట్టే, పవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి బారినుంచి టీడీపీని కాపాడి, ఆ తర్వాత నుండి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు చంద్రబాబు అంటూ మాణిక్యరావు అన్నాడు.

pilli manikya rao

కళావర్ రాణి అయిన కొడాలినానీ వింతజంతువు. దాన్ని కొట్టినా, తిట్టినా అది వినేజంతువుకాదు. దానిఖర్మన అది పోవాల్సిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతంగా ముందుకెళు తున్నసమయంలో చంద్రబాబునాయుడిపై సీఐడీతో తప్పుడు కేసులుపెట్టారు. సీఐడీవిభాగం గతంలో ప్రభుత్వం చేతిలో ఎలా అభాసుపాలైందో తెలుసు. కమలాసన్ రెడ్డి, అలియాస్ పిచ్చిరెడ్డితో తప్పుడు కేసుపెట్టించి, సీఐడీతో నోటిసులిచ్చారు. దానిపైకోర్టు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

విశాఖ ఉద్యమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. ఆసభ విజయవంతం కాకూడదనే, బూతులమంత్రి కొడా లినానీతో ప్రభుత్వం బూతులు తిట్టించింది. పనికిమాలిన, వెధవభాష మాట్లాడే కొడాలిని తిరిగిమాటనడం ఎంతోసేపు పట్టదు. అతనికంటే వెధవ, పోరంబోకు, అక్షరజ్ఞానంలేని వాడు మరొకడు ఉండడు. అసలు కొడాలి నాని కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా… బూతులకు పుట్టాడా? అంటూ ధ్వజమెత్తాడు పిల్లి మాణిక్యరావు.

kodali nani 1

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చనిపోయాడని, అతనిశవంతో చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడని కొడాలినాని మాట్లాడాడు. అతని పుట్టుకను అవమానించేలా మాట్లాడాలికానీ, నానీ తల్లిదండ్రుల ముఖం చూసిఊరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎవరూ చనిపో లేదు. ఉద్యమంలో భాగంగా తానుచావడానికి సిద్దమని మాత్రమే చెప్పాడు. అదే తెలియచేస్తూ లేఖరాశాడు. అటువంటి వ్యక్తి వ్యాఖ్యపై మంత్రి ఎలా మాట్లాడాలి. తమపార్టీఎంపీ లున్నారు, వారు వీరులు,శూరులు పార్లమెంట్ లో పోరాడి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని చెప్పాల్సిన బాధ్యత కళావర్ రాణిపై లేదా? వైసీపీఎంపీలంతా సిగ్గుతో తలొంచుకోవాలంటూ పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగాడు.

స్టీల్ ప్లాంట్ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడవద్దని, తామంతా ఉన్నామని భరోసాకల్పించేలా టీడీపీఎంపీ రామ్మో హన్ నాయుడు మాట్లాడాడు గానీ, వైసీపీఎంపీ ఒక్కడూ మాట్లాడలేదు. ప్రాణాలు తీసుకోవడంవల్ల ఏంసాధించలేమని స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి టీడీపీఎంపీ ధైర్యాన్ని నూరిపోశాడు. ఇటువంటి ఆలోచనలు వైసీపీఎంపీలకు రావు. వారుఏనాడూ కూడా రాష్ట్రప్రయోజనాలగురించి పార్లమెంట్లో మాట్లాడింది లేదు. మోడీదగ్గర మోకాళ్లొంచుకొని, ఆయనమోచేతి నీళ్లు తాగడానికితప్ప, వైసీపీఎంపీలు దేనికి పనికొస్తారంటూ మాట్లాడాడు పిల్లి.. మరి ఈయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది