Chandrababu
chandrababu naidu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎవరు కూడా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గానే హెచ్చరించాడు. కొన్ని జిల్లాల్లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించగా కొన్ని జిల్లాల్లో మాత్రం తెలుగు దేశం పార్టీ నాయకులు పోటీకి నిలిచారు. మొత్తంగా అయితే పరిషత్ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించింది అనే ప్రచారం జోరుగా సాగింది. దాంతో చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వారు ఓటు తో అధికార పక్షంను విమర్శించాల్సి ఉంటుంది. కాని చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అసలు చంద్రబాబు రాజకీయ పరిజ్ఞానం ఇదేనా అంటూ విమర్శలు గుప్పించారు. తన రాజకీయ అనుభవం గురించి అంతా ఇంతా అంటూ చెప్పుకుంటూ ఉండే చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం చేతులు ఎత్తేసి తన రాజకీయ అజ్ఞానాన్ని చాటుకున్నాడు అంటూ అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సొంత పార్టీకి చెందిన వారు ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఇది ఆయన రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగిలి పోనుంది.
Chandrababu
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు భయపడి పరిషత్ ఎన్నికలకు దూరంగా తెలుగు దేశం పార్టీ నిలిచింది అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లు.. మున్సిపల్ ఎన్నికల్లో ఎదురైన పరాభవంను దృష్టిలో ఉంచుకుని వైకాపా కు భయపడి తెలుగు దేశం పార్టీ ఈ పని చేసింది అంటూ జనాల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ పరువు తీసేలా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఉంది అంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఊగిపోతున్నారు.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.