chandrababu naidu : చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఇదో మాయని మచ్చ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

chandrababu naidu : చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఇదో మాయని మచ్చ

 Authored By himanshi | The Telugu News | Updated on :9 April 2021,1:06 pm

chandrababu naidu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎవరు కూడా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్‌ గానే హెచ్చరించాడు. కొన్ని జిల్లాల్లో పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించగా కొన్ని జిల్లాల్లో మాత్రం తెలుగు దేశం పార్టీ నాయకులు పోటీకి నిలిచారు. మొత్తంగా అయితే పరిషత్‌ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించింది అనే ప్రచారం జోరుగా సాగింది. దాంతో చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వారు ఓటు తో అధికార పక్షంను విమర్శించాల్సి ఉంటుంది. కాని చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

chandrababu naidu : బాబు రాజకీయ అజ్ఞానం…

తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అసలు చంద్రబాబు రాజకీయ పరిజ్ఞానం ఇదేనా అంటూ విమర్శలు గుప్పించారు. తన రాజకీయ అనుభవం గురించి అంతా ఇంతా అంటూ చెప్పుకుంటూ ఉండే చంద్రబాబు నాయుడు పరిషత్‌ ఎన్నికల విషయంలో మాత్రం చేతులు ఎత్తేసి తన రాజకీయ అజ్ఞానాన్ని చాటుకున్నాడు అంటూ అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సొంత పార్టీకి చెందిన వారు ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఇది ఆయన రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగిలి పోనుంది.

Chandrababu

Chandrababu

chandrababu naidu : మళ్లీ ఓటమి భయంతోనే…

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దూకుడుకు భయపడి పరిషత్‌ ఎన్నికలకు దూరంగా తెలుగు దేశం పార్టీ నిలిచింది అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లు.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎదురైన పరాభవంను దృష్టిలో ఉంచుకుని వైకాపా కు భయపడి తెలుగు దేశం పార్టీ ఈ పని చేసింది అంటూ జనాల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ పరువు తీసేలా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఉంది అంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఊగిపోతున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది