Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!
ప్రధానాంశాలు:
Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!
Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. అయితే, కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు, ఉద్వేగ భరిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి బూత్‌ల నుంచి వెళ్లగొడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు స్వేచ్ఛగా రిగ్గింగ్ నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!
Pulivendula Zptc : హోరా హోరీ..
నల్లపురెడ్డిపల్లిలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తుమ్మలపల్లిలో ఓటు వేయనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, రెండు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, తన గన్‌మెన్‌ను కూడా మార్చారని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కోట్లపల్లిలో టీడీపీ ఓటర్లను మాత్రమే ఓటు వేయనిస్తుండగా, మిగతా ఓటర్లను వెనక్కి పంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓటింగ్‌కు వచ్చిన ప్రజలపై దాడులు చేసి, కర్రలు, రాడ్లతో భయపెెడుతున్నారని, వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. హేమంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామాల్లో బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా, ఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపిస్తున్నారు. గ్రామాల్లో మీడియా ప్రతినిధులను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారని ఆరోపించారు. ఈ ఉపఎన్నికలో రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.