Kuppam Pulivendula : కుప్పం , పులివెందుల లో మరోసారి ఎన్నికల ఫైట్.. ఈసారి గెలుపు ఎవరిదీ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kuppam Pulivendula : కుప్పం , పులివెందుల లో మరోసారి ఎన్నికల ఫైట్.. ఈసారి గెలుపు ఎవరిదీ ..?

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,6:18 pm

ప్రధానాంశాలు:

  •  కుప్పం , పులివెందుల లో మరోసారి ఎన్నికల ఫైట్.. ఈసారి గెలుపు ఎవరిదీ ..?

  •  Kuppam Pulivendula : కుప్పం , పులివెందుల లో మరోసారి ఎన్నికల ఫైట్.. ఈసారి గెలుపు ఎవరిదీ ..?

Kuppam Pulivendula : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సంబంధిత నియోజకవర్గాలకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల ప్రకారం ఆగస్టు 10న ఓటింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లా కుప్పం, కడప జిల్లా పులివెందుల వంటి ప్రముఖ నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో భాగమవడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

Kuppam Pulivendula కుప్పం పులివెందుల లో మరోసారి ఎన్నికల ఫైట్ ఈసారి గెలుపు ఎవరిదీ

Kuppam Pulivendula : కుప్పం , పులివెందుల లో మరోసారి ఎన్నికల ఫైట్.. ఈసారి గెలుపు ఎవరిదీ ..?

Kuppam Pulivendula : జగన్ , బాబు అడ్డాలో ఈసారి గెలుపు ఎవరిదీ ..?

ఈసారి జెడ్పీటీసీ స్థానాల్లో పులివెందుల, ఒంటిమిట్ట, ఎంపీటీసీ స్థానాల్లో కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం, కారంపూడిలోని వేపకంపల్లి, నెల్లూరు జిల్లాలోని విడవలూరు-1 ఎంపికయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లా కొండెపి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక సర్పంచ్ పదవికి కూడా ఎన్నికలు జరుగుతాయి. జూలై 30వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రదర్శనతో పాటు, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నామినేషన్ల పరిశీలన ఆగస్టు 2న, తిరస్కరణపై అప్పీలు చేసుకునే గడువు 3వ తేదీ వరకు, వాటి పరిష్కారానికి గడువు 4వ తేదీ వరకు ఉంటుంది.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 5 మధ్యాహ్నం 3 గంటల వరకు. అదేరోజున అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆగస్టు 10న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. అవసరమైతే రీపోలింగ్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా మండలాలు, రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది