Ys Jagan : జగన్ వస్తున్నాడంటే కూటమి సర్కార్ భయపడుతుంది..!
ప్రధానాంశాలు:
కూటమి సర్కార్ మామిడి రైతులను అన్యాయం చేసింది - జగన్
Ys Jagan : జగన్ వస్తున్నాడంటే కూటమి సర్కార్ భయపడుతుంది..!
Ys Jagan : చిత్తూరు జిల్లాలో మామిడి పంట దిగుబడి విపరీతంగా వచ్చినా, కేజీకి కనీస ధర రూ.12 కూడా రావడం లేదని వైయస్ జగన్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిశీలించేందుకు వచ్చిన తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైయస్ఆర్‌సీపీ పార్టీ వారి తరపున ఉద్యమానికి దిగుతుందని హెచ్చరించారు. గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో మామిడి కేజీ రూ.22 నుంచి రూ.29 వరకు ధర లభించిందని, ఇప్పుడు మాత్రం రూ.2, రూ.3కి కూడా పంట విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు…

Ys Jagan : జగన్ వస్తున్నాడంటే కూటమి సర్కార్ భయపడుతుంది..!
Ys Jagan : రూ.2 కే కిలో మామిడి..కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులకు అన్యాయం – జగన్
జగన్ పేర్కొన్నదానిని బట్టి, మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు మే మాసం రెండో వారం నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉండగా, జూన్ మూడో వారం వరకు ఆలస్యమవడం వల్ల మార్కెట్ ముంచెత్తిందని, రైతులు కష్టాల్లో కూరుకుపోయారని చెప్పారు. ఫ్యాక్టరీలు, అధికారులు మరియు ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యం వల్ల వాహనాల్లోనే పంట కుళ్లిపోయే స్థితి ఏర్పడిందని అన్నారు. ఆయన ఆరోపణల ప్రకారం, ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా, తమపై ఆంక్షలు విధించడం ద్వారా అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించాలని చూస్తోందన్నారు.
వైయస్ జగన్ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ.. పక్క రాష్ట్రాల్లో కేజీకి రూ.16 వరకు మద్దతు ధర కల్పిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మామిడి ధర ఎందుకు అంతలా పడిపోయిందని మండిపడ్డారు. అలాగే రైతులకు పెట్టుబడి సహాయం, రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా వంటి ప్రయోజనాలు అందకుండా పోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆర్బీకేలు, ఈ–క్రాప్ వంటి వ్యవస్థలు రైతుల కోసం పని చేస్తే, ఇప్పుడు అవన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు కనీస ధర కల్పించకపోతే, తమ పోరాటం ముదురుతుందని హెచ్చరించారు.