Tirumala Vaikuntha Ekadashi : బిగ్ బ్రేకింగ్.. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీలో తోపులాట.. ఆరుగురు భక్తులు మృతి..!
Tirumala Vaikuntha Ekadashi : తిరుపతి వైకుంఠ ద్వార Tirumala Vaikuntha Ekadashi సర్వ దర్శనం టోకెన్ల జారీ లో అపస్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ దగ్గర టోకెన్ల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐతే ఒక్కసారిగా భక్తుల మధ్య జరిగిన తోపులాట వల్ల ఈ ఘటన జరిగింది…
Tirumala Vaikuntha Ekadashi అస్వస్థతకు గురైన వారిని..
గురువారం ఉదయం 5 గంటల నుంచి ఏర్పాటు చేసిన 9 కేంద్రాలు 94 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయాలని టిటిడి నిర్ణయించింది. ఐతే టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఐతే తొక్కిసలాట వల్ల జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్ లో రుయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
ఐతే ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తపరిచారు. జరిగిన ఘటన గురించి పూర్వపరాలను విచారిస్తున్నారు. ఐతే టోకెన్లు ఇస్తున్నారని చెప్పడం వల్లే అక్కడ తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. ఐతే భద్రత ఏర్పాట్ల లోపం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. Tirupathi, Vaikuntha Ekadashi Token, Tirumala, Andhra Pradesh