Traffic Challan : ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌క‌పోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా క‌ట్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Traffic Challan : ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌క‌పోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా క‌ట్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 December 2024,8:06 pm

ప్రధానాంశాలు:

  •  Traffic Challan : ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌క‌పోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా క‌ట్‌..!

Traffic Challan : ఇటీవ‌ల కొన్ని ప్ర‌భుత్వాలు రూల్స్ విష‌యంలో కఠిన చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సారి ఏపీలో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.పలుమార్లు ద్విచక్ర వాహన దారుల హెల్మెట్ వినియోగంపై హెచ్చరికలు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిపై వెయ్యి రూపాయల జరిమానా విధించి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది. బైకర్లపై భారీ జరిమానాలు విధించడం సరికాదని అభిప్రాయపడింది.

Traffic Challan ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌క‌పోతే ఇంతే ఇళ్లకు విద్యుత్ నీళ్ల సరఫరా క‌ట్‌

Traffic Challan : ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌క‌పోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా క‌ట్‌..!

Traffic Challan హైకోర్ట్ సీరియ‌స్..

ఇలా ఉల్లంఘనలు చేస్తున్న వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపేసే విషయాన్ని పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక సూచన చేసింది..హెల్మెట్లు ధరించే విషయంలో విజయవాడకూ, హైదరాబాద్ కూ హైకోర్టు పోల్చి చూపించింది. విజయవాడలో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారు తక్కువగా కనిపిస్తున్నారని, అదే హైదరాబాద్ లో పరిస్ధితి భిన్నంగా ఉందని తెలిపింది. విజయవాడ నుంచి తెలంగాణలోకి ఎంట్రీ కాగానే కార్లలో వెళ్లే వారు కూడా సీట్ బెల్టులు పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి ఏపీలో పోలీసులంటే వాహనదారులకు భయం లేదని తెలిపింది. ఈ వ్యవహారంలో రవాణాశాఖ కమిషనర్ ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు ట్రాఫిక్ ఐజీని ఈ నెల 18న జరిగే తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఆంధ్రలో కార్ల అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉంటున్నాయి.. ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం. అంతేకాదు ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని ఓ పిటీష‌న్ వేయ‌గా, దానిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది