TTD : తిరుమలలో మోసాలకు టీటీడీ చెక్కు… ఇకపై ఆధార్ లింకుతోనే ఆన్ లైన్ సేవలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TTD : తిరుమలలో మోసాలకు టీటీడీ చెక్కు… ఇకపై ఆధార్ లింకుతోనే ఆన్ లైన్ సేవలు…!

TTD : ప్రస్తుతం శ్రీ తిరుమల తిరుపతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. రోజురోజుకు విపరీతంగా భక్తుల రద్దీ పెరుగుతుండడంతో శ్రీవారి దర్శనానికి కనీసం 20 గంటల సమయం పడుతుంది. నిన్న అనగా శనివారం ఒక్కరోజే దాదాపు 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో దాదాపు 35,825 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజు శ్రీవారి యొక్క హుండీ ఆదాయం దాదాపు 3.8 కోట్ల వరకు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థాన […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2024,9:00 am

TTD : ప్రస్తుతం శ్రీ తిరుమల తిరుపతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. రోజురోజుకు విపరీతంగా భక్తుల రద్దీ పెరుగుతుండడంతో శ్రీవారి దర్శనానికి కనీసం 20 గంటల సమయం పడుతుంది. నిన్న అనగా శనివారం ఒక్కరోజే దాదాపు 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో దాదాపు 35,825 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజు శ్రీవారి యొక్క హుండీ ఆదాయం దాదాపు 3.8 కోట్ల వరకు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఇక టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులు 20 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.

TTD  అవకతవకలపై టీటీడీ దృష్టి….

ప్రస్తుతం టీటీడీలో అనేక రకాల అవకతవకలు బయటపడుతున్నాయి. దీంతో వాటిని సమూలంగా నియంత్రించేందుకు టీటీడీ అధికారులు కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా దళారుల వ్యవస్థను రూపుమాపడంపై దృష్టి సారించింది టీటీడీ . అయితే శ్రీవారి దర్శనం టికెట్ల డూప్లికేషన్ , నకిలీ వెబ్ సైట్స్ , అలాగే ఆన్ లైన్ దరఖాస్తులను పక్కదారి పట్టించడం వంటి సమస్యలపై ఇటీవల టీటీడీ దృష్టి సారించి వాటిని ఎలాగైనా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ సమస్యలను నియంత్రించేందుకు ఆన్లైన్ సేవలకు ఆధార్ కార్డు అనుసంధానించడమే సరైనదని టీటీడీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. టికెట్ల విషయంలో జరుగుతున్న మోసాలను ఆపాలంటే ఇదే ఖచ్చితమైన మార్గమని కావునపై సాధ్య సాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.

TTD తిరుమలలో మోసాలకు టీటీడీ చెక్కు ఇకపై ఆధార్ లింకుతోనే ఆన్ లైన్ సేవలు

TTD : తిరుమలలో మోసాలకు టీటీడీ చెక్కు… ఇకపై ఆధార్ లింకుతోనే ఆన్ లైన్ సేవలు…!

ఇదిలా ఉండగా ప్రస్తుతం టీటీడీ దర్శనం టికెట్లు అలాగే వసతి గదుల కేటాయింపు వంటి సేవలు మొత్తం ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. అయినప్పటికీ దళారుల బెడద మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడో ఒకచోట కుంభకోణాలు బయట పడుతూనే ఉన్నాయి. కావున ఈ తరహా మోసాలను ముందుగా పసిగట్టి నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తుంది. అందుకే ఈ మోసాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన టీటీడీ ఆధార్ లింక్ ద్వారా ఈ మోసాలను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆధార్ ద్వారా భక్తులను గుర్తించడం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలను తీసుకోవడం వలన మోసాలను సులువుగా నియంత్రించవచ్చని అంచనా వేస్తుంది. మరి టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం ఆధార్ లింక్ అనేది సాధ్యమా కాదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది