Ramoji Rao : రామోజీరావు మీద అద్భుతమైన విజయం సాధించిన ఉండవల్లి అరుణ్ కుమార్..!
Ramoji Rao : చాలా రోజుల నుంచి మార్గదర్శి కేసు కోర్టులో నడుస్తోంది. మార్గదర్శిలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టులో మార్గదర్శి యాజమాన్యమే 56 వేల పేజీల వివరాలను సమర్పించాల్సి వచ్చింది. దీంతో ఆ కేసు కాస్త స్ట్రాంగ్ అయిపోయింది. మార్గదర్శి డిపాజిటర్ల వివరాలను కోర్టుకు సమర్పించారు. అయితే.. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్ పై ఉన్న కేసు ఏంటంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను తుంగలో తొక్కి డిపాజిట్లు సేకరించారనేది ఆరోపణ. అందుకే మార్గదర్శి వ్యవహారంపై ఏపీ సీబీసీఐడీ విచారణ చేపడుతోంది. అలాగే.. దానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.
నిజానికి ఈ కేసును సీరియస్ గా తీసుకున్నది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో వైఎస్సార్ హయాంలోనూ రామోజీ రావుపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఉండవల్లి మార్గదర్శి అక్రమాలకే కేసు వేయడంతో మరోసారి మార్గదర్శి విషయం వెలుగులోకి వచ్చింది. కానీ.. అసలు తాము రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించలేదంటూ మార్గదర్శి యాజమాన్యం చెప్పుకుంటూ వచ్చింది. కానీ.. చివరకు డిపాజిటర్ల వివరాలను సమర్పించాల్సి వచ్చింది. దీంతో 54 వేల పేజీల డిపాజిటర్ల వివరాలను సమర్పించారు. రామోజీరావుపై నేరాభియోగాన్ని అప్పట్లోనే కొట్టేసినా.. ఆ కేసును మళ్లీ రీఓపెన్ చేసిన ఉండవల్లి సుప్రీంలో పిటిషన్ వేశారు.
Ramoji Rao : ఉండవల్లి సక్సెస్ అయినట్టేనా?
చివరకు మార్గదర్శి తమ డిపాజిటర్ల వివరాలను సమర్పించడంతో ఆ కేసులో ఉండవల్లి అంతో ఇంతో సక్సెస్ అయినట్టే. ఎందుకంటే కొట్టేసిన కేసును మళ్లీ రీఓపెన్ చేయించి.. డిపాజిటర్ల వివరాలు ఇవ్వం అన్న రామోజీ రావుతో డిపాజిటర్ల వివరాలు పొందుపరచడంతో ఓ రకంగా చెప్పాలంటే రామోజీ రావుపై ఉండవల్లి నెగ్గినట్టే. మార్గదర్శి కేసులో ఇది కీలక మలుపు అని చెప్పుకోవాలి. చూద్దాం.. ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో?