Ramoji Rao : రామోజీరావు న‌టించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ramoji Rao : రామోజీరావు న‌టించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?

Ramoji Rao : మీడియా మొఘ‌ల్ రామోజీరావు 88 ఏళ్ల వ‌యస్సులో అనారోగ్యంతో క‌న్నుమూసారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్.. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో జన్మించారు. భారత వ్యాపారవేత్తగా, మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా, సినీ నిర్మాతగా , ఫిల్మ్‌సిటీ అధినేతగా.. ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రామోజీరావు అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది రామోజీ ఫిలిం సిటీ. కొండల్లో ఆయన అద్భుతమైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Ramoji Rao : రామోజీరావు న‌టించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?

Ramoji Rao : మీడియా మొఘ‌ల్ రామోజీరావు 88 ఏళ్ల వ‌యస్సులో అనారోగ్యంతో క‌న్నుమూసారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్.. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో జన్మించారు. భారత వ్యాపారవేత్తగా, మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా, సినీ నిర్మాతగా , ఫిల్మ్‌సిటీ అధినేతగా.. ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రామోజీరావు అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది రామోజీ ఫిలిం సిటీ. కొండల్లో ఆయన అద్భుతమైన ఫిల్మ్ సిటీని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల‌లో చోటు ద‌క్కేలా చేశాడు. ఇక రామోజీరావు సినిమా రంగంలోను త‌న‌దైన ముద్ర వేశారు.

Ramoji Rao : న‌టుడిగా ఏ సినిమా అంటే..

ఉషా కిర‌ణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసి‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాతో నిర్మాత‌గా మారారు. దాదాపు 80 పైగా సినిమాల‌ను నిర్మించారు. తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాళీ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిల్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి సమాజానికి ఉపయోగపడే సామాజిక సినిమాలు ఉన్నాయి. రామోజీరావు నిర్మించిన చివరి చిత్రం 2015లో వచ్చిన ‘దాగుడుమూతల దండాకోర్‌’. అయితే రామోజీరావు నిర్మాత‌ల‌కి త‌న‌వంతు తోడ్పాటు అందించార‌ని అనుకుంటుంటారు. కానీ ఆయ‌న ఓ చిత్రంలో న‌టించారు అన్న సంగ‌తి చాలా త‌క్కువ మందికే తెలుసు.

Ramoji Rao రామోజీరావు న‌టించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా

Ramoji Rao : రామోజీరావు న‌టించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?

సినిమాలంటే ఇష్టపడే రామోజీరావు ఓ మూవీలో అతిథిగా నటించారు. 1978లో యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘మార్పు’ చిత్రంలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. నటించింది అతిథి పాత్రలోనే అయినా సినిమా పోస్టర్లపై రామోజీరావు బొమ్మ ప్రచురించడం గ‌మ‌నార్హం. స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్ర‌మంలోనే యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించారు. ఇప్పుడు అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. రామోజీరావు ఈనాడు న్యూస్‌పేపర్, ఈటీవీ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లు, ఈనాడు జర్నలిజం స్కూల్, సితార, విపుల, చతుర మ్యాగజైన్లు, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై సినిమా ప్రొడక్షన్, అలాగే.. మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పచ్చళ్లు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మయూరీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా .. అంచెలంచెలుగా భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది