Kadambari Jethwani : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత చర్చనీయాంశంగా మారాయో మనం చూస్తున్నాం. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీపై విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ వేధింపుల వ్యవహారం చర్చనీయాంశం కాగా, దానిపై టీడీపీ ఘాటుగా స్పందిస్తుంది. కుక్కల నాగేశ్వరరావు కుమారుడికి సంబంధం లేదు. పెద్ద పారిశ్రామిక వేత్తకు ఈ నటికి సంబంధం ఉండి ఉంటుంది. వైఎస్ జగన్‌ను ఆ పారిశ్రామికవేత్త వేడుకొంటే ఆయన ఈ విషయంపై చూసుకోవాలని పోలీసులకు ఆదేశించారని అనుకొంటా. ఆ క్రమంలోనే ఆమెపై కేసు పెట్టి ఉంటారని అనుకొంటాను అని రఘురామ రాజు తెలిపారు.
అయితే కుక్కల విద్యాసాగర్‌కు వ్యాపారాలు ఉన్నాయి. పలు నగరాలకు తిరుగుతుంటారు. ఆ వ్యాపార సంబంధాల వల్లనే ఆయనను ఈ కేసులో ఎంపిక చేసుకొని ఉంటారు. ఆయన నిమిత్తమాత్రుడే అనుకొంటాను. పారిశ్రామికవేత్తనే కీలకం అని భావిస్తాను. ఆ పారిశ్రామికవేత్తను అరెస్ట్ చేయాలంటే మహారాష్ట్ర పోలీసుల అనుమతి అవసరం ఉంటుంది అని రఘురామ కృష్ణం రాజు అన్నారు..ముంబై నటి జెత్వానీపై 5 లక్షల రూపాయల డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులందరూ వెళ్లి ఆమెను, ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముంబై పోలీసులకు సమాచారం లేకుండా తీసుకొస్తారా? ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు, వైసీపీ కీలక నేత శిక్ష అనుభవిస్తారా? అనేది వేచి చూడాలి. ఈ కేసు చూస్తే.. ఉన్నట్టుండి.. నన్ను అరెస్ట్ చేసిన విధంగానే ఉంది అని అన్నారు.
మరోవైపు ఈ కేసు విచారణకు విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయన్నారు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు. కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు. సీనియర్ ఐపీఎస్‌లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సీపీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. బాధితురాలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారని.. విచారణ కోసం మహిళా అధికారిని నియమించామని హోం మంత్రి వెల్లడించారు. పోలీసుల విచారణలో తప్పు చేసినట్టు తేలితే అధికారులతో సహా ఎవరి వదిలిపెట్టమన్నారు. పోస్టింగుల కోసం గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె అన్నారు. గత ప్రభుత్వంలో పోలీస్ విభాగాన్ని నిర్వీర్యం చేసి వారి సొంత పనులకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ కేసులో ఎవరు ఉన్నా.. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.