KCR – YS Jagan : ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి దారుణంగా మారింది. ఒకప్పుడు మాకు ఎదురే లేదనుకున్న బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలకి ఇప్పుడు జనాలలో విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కీలక నేతలు అనుకున్న వారు ఎందరో పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే వరుసగా రెండు సార్లు తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, మూడోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలవ్వడం తో అప్పటి నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో జనాల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ ను ఓటమిపాలు చేసింది.
కాకపోతే అంత ఘోరంగా అయితే ఓటమి చెందలేదు. బీఆర్ఎస్ ఓటమి చెందిన వెంటనే కేసీఆర్ కి అత్యంత నమ్మకస్తులుగా పేరుపొందిన వారే ముందుగా పార్టీని వీడి వెళ్ళారు. పట్నం మహేందర్ రెడ్డి , దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది కీలక నాయకులే పార్టీని వీడి కేసీఆర్ నమ్మకం పై దెబ్బకొట్టారు.ఇంకా ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇక వైసీపీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ మాదిరిగానే వైసీపీ కూడా ఏపీలో కూడా విచిత్ర పరిస్థితులు ఎదుర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలో కి వచ్చి 5 ఏళ్ల పాటు తన పాలన ను జనాలకు చూపించిన వైసీపీ తర్వాత బొక్కబోర్లా పడింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
జగన్ బంధువులు, అత్యంత సన్నిహితులు గా గుర్తింపు పొందిన వారు మొదటి నుంచి జగన్ వెంట నడిచిన ఎంతో మంది వైసీపీని వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఆళ్ళ నాని వంటి వారు పార్టీకి రాజీనామా చేయడం జగన్ కు పెద్ద షాకే ఇచ్చింది. ప్రస్తుతం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటి వారు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారితో పాటు పలువురు పార్టీనీ వీడతారని ప్రచారం జరుగుతుంది. చూస్తుంటే జగన్ పార్టీ పరిస్థితి కొద్ది రోజులలో మరింత అధ్వాన్నంగా మారనుందని అంటున్నారు
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.