Vangaveeti Radha Engagement : అంగరంగ వైభవంగా వంగవీటి రాధా నిశ్చితార్థం.. ఫొటోస్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 3, 2023, 9:00 pm

Vangaveeti Radha Engagement : దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్క ఆమని, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో ఆదివారం నరసాపురంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. అక్టోబర్ 22వ తారీకు సాయంత్రం ఏడు గంటలకు వీరి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు సంబంధించి అతి కొద్ది మంది ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

ఇకపోతే వంగవీటి రాధా 2004వ సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వైసీపీ పార్టీలో చేరిన వంగవీటి రాధా 2014 ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు.

vangaveeti radha engagement photos

Vangaveeti Radha Engagement : అంగరంగ వైభవంగా వంగవీటి రాధా నిశ్చితార్థం.. ఫొటోస్..!!

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి క్యాంపెనర్ గా ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నికల ఫలితాలు అనంతరం వంగవీటి రాధ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

Breaking News

No bio available for this author.

  1. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  2. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  3. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  4. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  5. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  6. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  7. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp