Vangaveeti Radha : వంగవీటి రాధా ఇప్పుడేం చేస్తారు.. ప్రమాదంలో రాజకీయ భవిష్యత్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vangaveeti Radha : వంగవీటి రాధా ఇప్పుడేం చేస్తారు.. ప్రమాదంలో రాజకీయ భవిష్యత్..?

Vangaveeti Radha : వంగవీటి రాధా అంటే ఏపీ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆయన తండ్రి వంగవీటి రంగా ఒకప్పుడు ఎంత బలమైన లీడర్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయి 35 ఏళ్లు దాటుతున్నా సరే ఆయన గురించి ఇప్పటికీ కథలు, కథలుగానే చెప్పుకుంటారు. మరి అంత పవర్ ఫుల్ లీడర్ కొడుకు అయిన వంగవీటి రాధా పొలిటికల్ భవిష్యత్ మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా సాగట్లేదు. 2004లో మొదటిసారి విజయవాడ తూర్పు […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,5:15 pm

ప్రధానాంశాలు:

  •  Vangaveeti Radha : వంగవీటి రాధా ఇప్పుడేం చేస్తారు.. ప్రమాదంలో రాజకీయ భవిష్యత్..?

Vangaveeti Radha : వంగవీటి రాధా అంటే ఏపీ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆయన తండ్రి వంగవీటి రంగా ఒకప్పుడు ఎంత బలమైన లీడర్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయి 35 ఏళ్లు దాటుతున్నా సరే ఆయన గురించి ఇప్పటికీ కథలు, కథలుగానే చెప్పుకుంటారు. మరి అంత పవర్ ఫుల్ లీడర్ కొడుకు అయిన వంగవీటి రాధా పొలిటికల్ భవిష్యత్ మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా సాగట్లేదు. 2004లో మొదటిసారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

Vangaveeti Radha వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ డైల‌మా

కాగా మళ్లీ 2014లో విజయవాడ తూర్పు నుంచే వైసీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఆ సమయంలో స్వల్ప తేడాతో ఓడిపోయాడు రాధా. ఇక మల్లీ 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు కావాలని రంగా కోరాడు. కానీ జగన్ ఇవ్వలేదు. దాంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎక్కడి నుంచి పోటీ చేయలేదు. కానీ చాలా నియోజకవర్గాల్లో రాధా ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే రంగా టికెట్ అడగలేదో.. లేదంటే చంద్రబాబే కావాలని ఇవ్వలేదో తెలియదు గానీ.. ఈ ఎన్నికల్లో రంగా పేరు పరిశీలనలో కూడా లేదు.

ప్రస్తుతం ఆయనకు ఎక్కడి నుంచి టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఎంపీ బాలశౌరిని కలిశారు రాధా. దాంతో ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కాపుల మద్దతు జనసేనకు ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తే ఆయనకు తిరుగు ఉండదని అంతా అంటున్నారు. అయితే ఆయనకు బందరు పార్లమెంట్ టికెట్ లేదా అవనిగడ్డ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ బందరు నుంచి బాలశైరి పేరు ఖరారు అయింది. ఇక మిగిలిన అవనిగడ్డ ఎమ్మెల్యే టికెట్ ను టీడీపీ నుంచి వస్తున్న మండలి బుద్ద ప్రసాద్ కే ఇస్తారని అంటున్నారు.

ఇప్పటికే చర్చలు జరిగాయని.. త్వరలోనే మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరుతారని, ఆయనకే టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో ఇప్పుడు రంగా రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. రంగాకు ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి టికెట్ రాదని అంటున్నారు. ఇప్పుడు గనక పోటీ చేయకపోతే రాధాకు రాజకీయ భవిష్యత్ లేనట్టే అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది