Kodali Nani : లోకేష్ చేసిన కామెంట్లకు పాయింట్ బ్లాక్ కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని.. వీడియో !!
Kodali Nani : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “యువగళం” పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సాగుతోంది. ఇప్పటికే 2700 కిలోమీటర్లకు పైగా 200 రోజులు నడిచిన లోకేష్.. పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మొన్న కృష్ణాజిల్లాలో గన్నవరం సభలో కొడాలి నాని, వల్లభనేని వంశీల పై లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో ఇద్దరిని ఓడించాలని లోకేష్ పిలుపునిచ్చారు. అనవసరంగా తన కుటుంబ సభ్యులపై ఈ ఇద్దరు ఎవరు పారేసుకున్నారు అని ఆరోపించారు. కచ్చితంగా ఉచ్చ పోయిస్తా అంటూ హెచ్చరించారు.
తనకి తాత గొంతు వచ్చిందని లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లోకేష్ తనపై వంశీ పై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని తాజాగా స్పందించారు. ముఖ్యంగా తనకి తన తాత గొంతు వచ్చిందని రామారావు గారితో పోల్చుకోవడం పట్ల కొడాలి నాని సెటైర్లు వేశారు. లోకేష్ తాత బహుశా ఖర్జూర నాయుడై ఉంటాడు. అతని గొంతు వచ్చిందని చెప్పుకుంటున్నారు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
ఇదే సమయంలో వివేకానంద రెడ్డి చనిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తి వచ్చిందా కూడా ప్రస్తావన వచ్చిన సమయంలో కొడాలి నాని పేర్కొన్నారు. రామారావు గారిని చంపితే 40 ఏళ్లు చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందారు. వివేకానంద రెడ్డి చనిపోవడం వల్ల జగన్ కి ఏమైనా రాజకీయ లాభం వచ్చిందా అంటూ.. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు కొడాలి నాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
